సినీ ఇండస్ట్రీ ఎలా ఉండాలో ఒక్కమాటలో చెప్పేసిన చిరంజీవి.. !

మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలనచిత్ర ప్రముఖ హీరోగా అందరికీ సుపరిచితమే. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి తెలుగు ఇండస్ట్రీనే శాసించే స్థాయికి ఎదిగాడు. దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా 150 కి పైగా చిత్రాలలో నటించి భారతదేశంలోనే చెప్పుకోదగ్గ గొప్ప హీరోగా రాణిస్తున్నాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవి మరొకవైపు రాజకీయ రంగంలోకి ప్రవేశించి.. అక్కడ కూడా గుర్తింపు పొంది రాణించడం జరిగింది. తరువాత సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చి కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా తన క్రేజ్ ను తగ్గట్టుగా సినిమాలలో రాణిస్తున్నాడు. అలా మెగాస్టార్ చిరంజీవి గురించి ఇదంతా తెలిసిందే. ఇక అసలు విషయం ఏంటంటే ఇటీవలే కాలంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి సినీ ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేరాయి.

చిరంజీవి ఆ కార్యక్రమం ద్వారా సినీ ఇండస్ట్రీలో అందరూ స్నేహభావంతో మెలగాలని తెలిపాడు. తాను ఇండస్ట్రీకి వచ్చే కొత్తల్లో హీరోల మధ్య అభిమానం ఉండేది కానీ సినిమా విడుదల తర్వాత హీరోల మధ్య కాస్త ఈర్ష్య అనేది ఉండడం గమనించానని తెలిపాడు. చేసిన సినిమాలు ఒకసారి విజయం సాధిస్తాయి. మరోసారి పరాజయం అవుతాయి. వీటన్నిటిని పక్కన పెట్టి సినీ ఇండస్ట్రీలో ఉన్న మనమంతా ఒక కుటుంబంలో భావించాలని తెలిపాడు.

తాను చేసిన సినిమా శంకర్ దాదా ఎంబిబిఎస్ లో ఒక సన్నివేశాన్ని గుర్తుచేస్తూ.. ఒక పెద్దాయన హాస్పిటల్ లో క్లీన్ చేస్తుంటే, అది ఆరక ముందే అందరూ నడవడం వల్ల చాలా చిరాకు పడతాడు. అదే అతనిని దగ్గరికి తీసుకుంటే సంతోషంతో ఆనందభాష్పాలు కారుస్తాడు. సినీ ఇండస్ట్రీలో కూడా అంతే పక్క వాళ్ళను ఎత్తిచూపకుండా కలిసిపోయే స్వభావం ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారని పేర్కొనడం జరిగింది.

తాను ఏ సినిమా మొదలుపెట్టిన ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలను పిలిచి ఒక ఫంక్షన్ లాగా చేసుకుంటానని.. తన జీవితంలో విలువైన కార్యక్రమాలకు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులను పిలిచి వారితో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంటుందని తెలిపాడు. ఆ భావన అందరిలో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇటీవలే విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే.