రామ్ చరణ్ కూతురి పేరు వైరల్.. అర్థమిదే!

మెగా వారసురాలిని ఎప్పుడు చూస్తామా? తనకి ఏ పేరును పెట్టనున్నారు? అని చాలా మంది మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పపటికే ఓ పేరును అనుకున్ననట్లు ఇటీవలే ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ తెలియజేశారు. తాజాగా ఆ పేరును.. ఇప్పుడు పాప బారసాల నాడు చిరంజీవి తెలిపారు. ఆ వివరాలు..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ఈనెల 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వివాహం జరిగిన 11 ఏళ్లకు ఈ దంపతులకు కూతురు పుట్టడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానుల్లో ఎంతో ఉత్సాహం నెలకొంది. అందరూ సంబరాలు చేసుకుంటున్నారు.

అంతేకాకుండా చిరు ఫ్యామిలీకి ఇష్టమైన మంగళవారమే పాప జన్మించడం వల్ల చిరంజీవి కుటుంబం మొత్తం సంతోషంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలోనే జూన్ 30న మెగాస్టార్ ఇంట్లో బారసాల కార్యక్రమం పెద్ద ఎత్తున జరిపారు. పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై పాపను ఆశ్వీర్వదింటారు. బహుమతులు కూడా ఇచ్చారు. అలానే మరోవైపు ఆమెకు పేరు ఏమని పెడతారో అని మెగా అభిమానుల్లో విపరీతంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు అందరూ రకరకాల పేర్లు కూడా సూచించారు. అయితే తాజాగా తన మనవరాలి పేరు తెలియజేస్తూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్, ఉపాసన కూతురి పేరు క్లింకారా అని పెట్టినట్లుగా తెలిపారు.

అమ్మాయి పేరు క్లిన్ కారా కొణిదెల. లలితా సహస్రనామం నుంచి తీసుకున్నాం. ఈ పేరు.. ఆధ్యాత్మిక మేల్కొలుపును తీసుకువచ్చే శక్తిని, ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుంది! ఈ లక్షణాలనను మా లిటిల్ ప్రిన్సెస్ అందిపుచ్చుకొని తన వ్యక్తిత్వంలో పెరిగేకొద్దీ ఇమడ్చుకుంటుందని కచ్చితంగా నమ్ముతున్నాము అని చిరంజీవి రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడు చరణ్ కూతురి పేరు సోషల్ మీడియాలో ట్రెండింగా మారింది. అందరూ ఆ పసిబిడ్డను ఆశ్వీర్వదిస్తున్నారు. ఇంకా.. చిరంజీవి, సురేఖతో పాటు ఉపాసన తల్లితండ్రులు ఉన్న ఫోటోను కూడా చిరంజీవి షేర్ చేశారు. ఈ ఫోటో కూడా వైరల్ గా మారింది.