Chiranjeevi : ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్ళీ దూకుడు పెంచిన చిరుకి కరోనా బ్రేకులు వేసింది. కరోనా ముందు ఆచార్య సినిమా మొదలుపెట్టిన లాక్ డౌన్ వాళ్ళ వాయిదా పడి చివరకు ఇపుడు విడుదలకు సిద్ధమైంది. ఇక చిరు తన తదుపరి చిత్రాలను కూడా చిరు జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తున్నారు. చిరంజీవి తన నెక్స్ట్ సినిమా గాడ్ ఫాదర్ కోసం పగలు రాత్రి కష్టపడుతున్నారు. ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ సినిమాకు రీమేక్ ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక భోళా శంకర్ సినిమా షూటింగ్ కూడా జోరుగా జరుగుతోంది. ఇది అన్న చెల్లెల సెంటిమెంట్ తో రూపొందుతోంది. ఇక ఈ సినిమా తమిళ సినిమా వేదళం సినిమాకు రీమేక్. భోళా శంకర్ లో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ తన ప్రాజెక్ట్స్ ను శరవేగంగా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఇక రీసెంట్ అప్ డేట్ ప్రకారం డైరెక్టర్ వెంకీ కుడుముల స్క్రిప్ట్ కి చిరు ఓకే అన్నారట. ఇక బాబీ డైరెక్షన్ లో మరో సినిమాలో కూడా చిరు బిజీ. ఇలా చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయని యువ హీరోలతో పోటీ పడుతున్నారని చిరు గురించి అందరు అనుకుంటున్నారు.
కానీ చిరు మరో షాకింగ్ న్యూస్ చెప్పి అందరిని షాక్ చేసారు ఆచార్య ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్నారు చిరు తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ గురించి చెప్పి ఆశ్చర్య పరిచారు.తాను కొత్తగా మరో ఐదు సినిమాలు కమిట్ అయినట్లు వెల్లడించారు. ఇలా విరామం లేకుండా సినిమాలు చేయడం తనకేమీ కష్టంగా అనిపించడం లేదని ఆయన చెప్పారు. ఇప్పుడు తన చేతుల్లో ఐదు సినిమాలు ఉన్నాయనే అంతా అనుకుంటున్నారని కాని మరో ఐదు సినిమాలకు తాను కమిట్ అయ్యానని చెప్పారు. ఇక ఈ వయసులో కష్టపడటం తనకేమి ఇబ్బందిగా లేదని సినిమాల్లో అవకాశం రావడం అదృష్టం అది నిలబెట్టుకోవడానికి నిరంతరం కష్టపడాలని చెప్పారు.