చిరంజీవిని మళ్ళీ ఆ దోమ కుట్టిందట.!

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విషయంలో చిరంజీవి తప్పడడుగు వేశారా.? అంటే, ‘అలాంటి సినిమా ఒకటి చేయాలన్న కోరిక తీర్చుకున్నారు’ అనడం సబబు అవుతుందేమో.! సొంత బ్యానర్‌లో చిరంజీవి చేసిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’.

సినిమా హిట్టే.. అనిపించేశారు. కానీ, దాన్ని కాస్ట్ ఫెయిల్యూర్ అని చెబుతుంటారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. అయితే, ‘బాహుబలి’ స్థాయిలో పాన్ ఇండియా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది ఆ సినిమా.

మళ్ళీ అలాంటి ఇంకో సినిమా ఆలోచన చిరంజీవి తాజాగా చేస్తున్నారన్నది ఓ గాసిప్. ఈసారి కూడా సొంత బ్యానర్‌లోనే ఆ ప్రయత్నం చేయబోతున్నారట. అయితే, ఈసారి కొత్త బ్యానర్.. అంటున్నారు.

ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథకి చిరంజీవి ఓకే చెప్పారనీ, అయితే బడ్జెట్ పరంగా కొన్ని పరిమితులతో ఆ సినిమా చేస్తారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.