మెగా ధమాకా కాంబో.. ఫిక్స్ అయ్యేలా ఉంది!

ఇటీవల ధమాకా సినిమాతో త్రినాధ రావు నక్కిన బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా రవితేజకు మాత్రమే కాకుండా దర్శకుడికి కూడా మంచి బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు వీరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా క్లిక్ అవ్వలేదు. ఇక ధమాకా సినిమా ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ అందుకోవడంతో మళ్ళీ ఒక్కసారిగా ఇద్దరు కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు.

ఇక వీరికి ఇండస్ట్రీలో ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. మరోవైపు రవితేజ కొత్త ప్రొడక్షన్ లో రెమ్యునరేషన్ పెంచు మరి కొత్త ప్రాజెక్టులను ఓకే చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ధమాకా డైరెక్టర్ త్రినాధరావు కూడా తన తదుపరి సినిమాలను బడా హీరోలతో సెట్స్ పైకి తేవాలి అని చూస్తున్నాడు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో కూడా ఆయన సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల ధమాకా సినిమా సక్సెస్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి అతనితో ప్రత్యేకంగా మాట్లాడి మంచి కథ ఉంటే ఫైనల్ చేయమని కూడా చెప్పారట. ఇక త్రినాధరావు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి తగ్గట్టుగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండే కథను రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఈ హీరో బడా హీరోలతో సినిమా చేయాలని గట్టిగానే ప్రయత్నాలు చేశాడు కానీ ఏవి వర్కౌట్ కాలేదు.

ముఖ్యంగా వెంకటేష్ తో అనుకున్న ప్రాజెక్టు కాన్సిల్ అయింది. అలాగే అల్లు అర్జున్ తో కూడా గతంలో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అది కూడా ఫైనల్ కాలేదు ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో చేసే ఆఫర్ వచ్చింది. ఈ సినిమా సెట్ అయితే గనక అతని రేంజ్ మరో లెవల్ కు వెళ్లినట్లే అని చెప్పవచ్చు. ఇక ఈ కాంబో ప్రాజెక్ట్ ను డివివి.దానయ్య నిర్మించే అవకాశం ఉందని సమాచారం.