కొరటాల తప్పించాడు.! చిరంజీవి రప్పించాడు.!

‘ఆచార్య’ సినిమా గుర్తుందా.? అదెలా మర్చిపోగలం.? చాలా పెద్ద డిజాస్టర్ అది.! మెగా పవర్ కాంబినేషన్.. అంత పెద్ద డిజాస్టర్ అవడాన్ని మెగాభిమానులు ఎప్పటికీ జీర్ణించుకోలేరు. దర్శకుడు కొరటాల శివకి ఇదే తొలి డిజాస్టర్ కూడా.!

తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషని అనుకున్నారు. కానీ, దర్శకుడు కొరటాల శివ ఆమెను పీకి పారేశాడు. ఆ ప్లేస్‌లోకి కాజల్ అగర్వాల్ వచ్చి చేరింది. కాజల్ అగర్వాల్ కంటే త్రిష బెస్ట్ ఆప్షన్.. కానీ, త్రిషని తప్పించి కాజల్‌ని ఎందుకు తీసుకున్నాడో ఏమో కొరటాల.!

చిరంజీవి అస్సలేమాత్రం క్వశ్చన్ చేయకుండా, పూర్తి స్వేచ్ఛని కొరటాలకు ఇస్తే, ఆయనేమో.. చివరికి కాజల్‌ని కూడా సినిమాలోంచి పీకేశాడు.. అదీ పూర్తి రెమ్యునరేషన్ కాజల్‌కి సమర్పించుకుని.

అయితే, త్రిష మాత్రం చిరంజీవి పట్ల ఎప్పుడూ ఒకే అభిమానంతో వుంటూ వచ్చింది. అప్పుడు త్రిషకి ఇచ్చిన మాటని చిరంజీవి ఇప్పుడు నిలబెట్టుకున్నారు. ‘విశ్వంభర’ సినిమాలో త్రిష హీరోయిన్. ఆమెకు స్వాగతం పలుకుతున్నట్లు ‘విశ్వంభర’ టీమ్ తరఫున చిరంజీవి పేర్కొనడం గమనార్హం.

మెగాస్టార్ చిరంజీవి అంతటి వ్యక్తి, తనను ఇంత గౌరవంగా ‘విశ్వంభర’ టీమ్‌లోకి ఆహ్వానించడాన్ని త్రిష ఎమోషనల్‌గా ఫీల్ అయ్యింది. ఇంతకీ, ‘ఆచార్య’ విషయంలో కొరటాల ఎందుకలా చేశాడు.? అదో మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇప్పటికీ.!