రాజమౌళితో ఛాన్స్ మిస్ చేసుకున్న చిరంజీవి.!

చాలాకాలం క్రితం నాటి మాట ఇది. రాజకీయాల్లోకి చిరంజీవి వెళ్ళక ముందు జరిగింది. చిరంజీవితో రాజమౌళి ఓ సినిమా చేయాల్సి వుంది. ఎలాగైనా చిరంజీవిని డైరెక్ట్ చేయాలని కాళ్ల చెప్పులు అరిగేలా తిరిగాడు కానీ, కుదరలేదు. అప్పట్లో చిరంజీవి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇక ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడం, దాదాపు తొమ్మిదేళ్లు సినిమాలకు దూరంగా వుండడం తదితర కారణాలతో రాజమౌళికి ఆ ఛాన్స్ లేకుండా పోయింది.

ప్రస్తుతం చిరంజీవి సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి బిజీగా వున్నారు. వరుస ప్రాజెక్టులు ఒప్పేసుకున్నారు. ఒప్పుకుంటూనే వున్నారు. మరి, ఇప్పుడైనా రాజమౌళికి ఛాన్స్ దొరుకుతుందా.? ప్చ్ కొంచెం.. కష్టమే.! కానీ అసాధ్యం అయితే కాకపోవచ్చు. ఏమో, గుర్రం ఎగరావచ్చు. ‘ఆచార్య’ ఫ్లాప్‌తో పడిపోయిందనుకున్న చిరంజీవి మార్కెట్, మళ్లీ ‘వాల్తేర్ వీరయ్య’‌తో తిరిగొచ్చేసింది.

ఈ క్రమంలో పూరీ జగన్నాధ్, వినాయక్.. ఇలా పలువురు సీనియర్ డైరెక్టర్లు కాసుక్కూచ్చున్నారు. ఆ లిస్టులో రాజమౌళీ ఓ ఛాన్స్ తీసుకుంటే పోలా.!