‘భోళా శంకర్’ చిత్ర షూటింగ్, డబ్బింగ్ పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి ఫారెన్ టూర్ కు వెళ్లారు. తన భార్య సురేఖతో కలిసి ఈ ట్రిప్ కు వెళ్లారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేశారు. దాని గురించే ఈ కథనం..
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో ‘ఖైదీ నెo.150’ సినిమా తర్వాత కెరీర్ లో ఫుల్ జోరు ప్రదర్శిస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీగా దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఆచార్య’ డిజాస్టర్ అందుకున్నా.. ఆ తర్వాత ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ ను అందుకని తన స్టామినా ఏంటో మరోసారి బాక్సాఫీస్ ముందు నిరూపించారు.
ప్రస్తుతం ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘భోళాశంకర్’తో చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైంది. డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఆగస్ట్ 11న సినిమా రిలీజ్ కు కూడా రెడీ అయిపోయింది. కొత్త సినిమా పనులపై కూడా దృష్టి పెట్టారు. రీసెంట్ గా ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కూతురు కూడా పుట్టడంతో ఆ ఇంట్లో ఆనందం మరింత రెట్టింపు అయింది.
అలా మెగా ప్రిన్సెస్ రాకతో ఆనందోత్సాహంలో ఉన్న చిరు, షూటింగ్ లు కూడా పూర్తవ్వడంతో.. భార్య సురేఖతో కలిసి మరోసారి ఫారెన్ టూర్ అమెరికాకు వెళ్లారు. ఈ విషయాన్ని చిరు.. తన సోషల్ మీడియా ట్విట్టర్, ఇన్ స్టా వేదికగా తెలిపారు. ఫ్లైట్‌లో దిగిన నాలుగు ఐదు ఫొటోలను షేర్ చేశారు.
“సురేఖతో చిన్న హాలీడే ట్రిప్ కోసం అమెరికా వెళ్తున్నాను. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తర్వాత చేయబోయే హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ షూట్‌కు వెళ్లే ముందు కాస్త రిఫ్రెష్‌మెంట్ కోసమే ఈ టూర్” అని చిరు క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇలాంటి టూర్ రిఫ్రెష్‌మెంట్ తో పాటు ఉత్తేజాన్ని కూడా నింపుతుంది అని పేర్కొన్నారు.
అంతకుముందు ట్వీట్ లో ‘భోళాశంకర్’ ను ఉద్దేశిస్తూ.. “మాస్ ఫైర్ ఎంటర్‌టైనర్ చూసేందుకు అంతా సిద్ధంకండి. డేట్ నోట్ చేసుకోండి” అని కూడా రాసుకొచ్చారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. చిరుకు సోదరిగా కీర్తి సురేశ్ నటించింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రాంబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.
Off to US on a short holiday with Surekha to refresh and rejuvenate before I join the shoot of my next, a hilarious family entertainer being produced by @GoldBoxEnt ! pic.twitter.com/rWTihORaWZ
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 7, 2023