చిరంజీవే నా స్ఫూర్తిప్రదాత: విక్టరీ వెంకటేశ్‌

‘కలియుగ పాండవులు’ సినిమాతో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి హీరోగా సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిశాడు వెంకటేశ్‌ . కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్‌.. ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో కూడిన సినిమాలతో వినోదాన్ని అందించడం వెంకీ స్పెషాలిటీ. తన యాక్టింగ్‌తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న వెంకటేశ్‌ ప్రస్తుతం వెంకీ 75 సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే.

తాజాగా వెంకీ మామ సినిమాటిక్‌ జర్నీ సెలబ్రేషన్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈవెంట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా వెంకీ మాట్లాడిన మాటలు అందరిలో జోష్‌ నింపాయి. చిరంజీవి ఇక్కడ లేకుంటే నేను సినిమాల నుంచి తప్పుకొని ఇప్పటికే హిమాలయాలకు వెళ్లేవాడినంటూ చెప్పుకొచ్చాడు వెంకటేశ్‌. చిరంజీవి సుమార్‌ 9 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఖైదీ నెం 150 సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్టు కొట్టడం చూసి.. నా అభిమానులకు వినోదాన్ని పంచడం కొనసాగించాలని ఫిక్స్‌ అయ్యా. అప్పుడే ఖచ్చితంగా యాక్టింగ్‌కొనసాగించాలని అనుకున్నా.

యాక్టింగ్‌ ఇక ఆపను అంటూ వెంకీ మామ నుంచి ఆసక్తికర కామెంట్స్‌ వచ్చేసరికి ఆడిటోరియం అంతా అరుపులు, విజిల్స్‌, ప్రశంసలతో హోరెత్తిపోయింది. వెంకటేశ్‌ కాంపౌండ్‌ నుంచి యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ‘సైంధవ్‌’ చిత్రానికి హిట్‌ ఫేం శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. సైంధవ్‌ జనవరి 13న సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషనల్‌ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది వెంకీ టీం. చందప్రస్థ ఫిక్షనల్‌ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌ మిషన్‌ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రంలో జెర్సీ ఫేం శ్రద్దా శ్రీనాథ్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోండగా.. బాలీవుడ్‌ యాక్టర్‌ నవాజుద్దీన్‌ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నవాజుద్దీన్‌ సిద్దిఖీ ఈ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే సైంధవ్‌ రోల్స్‌ ఇంట్రడక్షన్‌ వీడియో నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. సైంధవ్‌లో శ్రద్దా శ్రీనాథ్‌ మనోజ్ఞగా, రుహానీ శర్మ డాక్టర్‌గా, నవాజుద్దీన్‌ సిద్దిఖీ వికాస్‌ మాలిక్‌ పాత్రలో, కోలీవుడ్‌ యాక్టర్‌ ఆర్య మానస్‌ పాత్రలో కనిపించనున్నారు. సైంధవ్‌ గ్లింప్స్‌ వీడియో ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచుతోంది. సైంధవ్‌ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి తెరకెక్కిస్తుండగా.. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు.