మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సెట్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాడు. అంతకు ముందుగానే సమంత కోసం చాలా గ్యాప్ తరువాత మొహానికి రంగు వేసి సెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో రఫ్ఫాడించిన చిరు.. ఇప్పుడు సమంత శామ్ జామ్ షోలో రచ్చ చేయనున్నాడు. అయితే చిరంజీవి సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అలా స్టైల్‌గా నడిచి వస్తుంటే కెమెరా కళ్లన్నీ అటు వైపే చూసినట్టున్నాయి. ఈ ఫోటోలను చూస్తుంటే చిరంజీవి వయసు దాదాపు మూడు దశాబ్దాలు వెనక్కి వెళ్లిందా అనే అనుమానం వస్తుంది.
చిరంజీవి ఆచార్య కోసం బాగానే కష్టపడ్డాడు. కొరటాల కూడా కచ్చితంగా తనకు నచ్చేలా కథకు సరిపోయేలా ఫిట్ నెస్ కావాలని అన్నాడట. అందుకే సైరా అయిపోయిన వెంటనే చిరంజీవి కసరత్తులు చేయడం ప్రారంభించాడు. ఈ లాక్డౌన్‌లో చిరు వ్యాయామాలు, కొత్త లుక్‌లు, మేకప్ టెస్ట్‌లు ఇలా ఎన్నెన్నో చేస్తూ మరింత యంగ్‌గా తయారవుతున్నాడు. తాజాగా బయటకు వచ్చిన ఫోటోలను చూస్తే అందరికీ ఆ విషయం అర్థమవుతుంది. ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
సీనియర్ హీరో అయినా యంగ్ హీరోలకు పోటీనిచ్చే ఫిటెన్‌స్ గ్లామర్ చిరు సొంతమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చిరు ఎవర్ గ్రీన్ అని కామెంట్లు పెడుతున్నారు. గతవారమే చిరంజీవి ఆచార్య సెట్‌లో అడుగుపెట్టాల్సి ఉన్నా కూడా.. కరోనా వల్ల వాయిదా పడింది. టెస్టింట్ కిట్ లోపం వల్ల చిరుకు పాజిటివ్ అని తప్పుడు ఫలితం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మూడు నాలుగు రోజులకు ఆ ఫలితం తప్పని, తనకు అసలు కరోనాయే రాలేదని స్ఫష్టం చేశాడు. ప్రస్తుతం శామ్ జామ్ కోసం కదిలిన చిరు.. త్వరలోనే ఆచార్య సెట్‌లో అడుగుపెట్టి షూటింగ్ మొదలెట్టనున్నాడు. ఆచార్య వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.