చిరంజీవి కొత్త సినిమా అప్పుడే కాదు.!

‘భోళా శంకర్’ సినిమాతో నెగిటివ్ రికార్డు క్రియేట్ చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా రిజల్ట్ ఆశించినట్లుగా వుంటే, తదుపరి సినిమాని వెంటనే పట్టాలెక్కించేయాలనుకున్నాడట చిరంజీవి.

కళ్యాణ్ కృష్ణ‌తో చిరంజీవి ఎప్పుడో ఓ ప్రాజెక్ట్ సెట్ చేసి పెట్టేశారు. ఆ ప్రాజెక్ట్‌నే ‘భోళా శంకర్’ తర్వాత సెట్స్ మీదికి తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ, ‘భోళా శంకర్’ రిజల్ట్ బెడిసికొట్టడంతో ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేయాలనుకుంటున్నారట.

అలాగే, ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్టతోనూ చిరంజీవి ఓ సినిమాకి కమిట్ అయ్యారు. ఆ సినిమా కూడా లైన్‌లోనే వుంది. కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథతో పోల్చితే, వశిష్ట కథకు బాగా కనెక్ట్ అయ్యాడట చిరంజీవి.

సో, ఇమ్మీడియట్‌గా హిట్ కొట్టాలంటే, వశిష్ట స్టోరీని పట్టాలెక్కిస్తే బావుంటుందని ఆలోచిస్తున్నారట. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి, చిరంజీవి ఏం చేస్తారో.!