అందుకే మెగాస్టార్ హాజరు కాలేదు

తాజాగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు హైదరాబాద్ లో జరిగాయి. దీనికి టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ ప్రముఖులు అందరిని ఆహ్వానం అందింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేక ఆహ్వానం అందింది. సినిమా వేడుక అంటే కచ్చితంగా మెగాస్టార్ ఉంటాడు. అలాంటిది శతజయంతి వేడుకలలో మెగాస్టార్ హాజరుకాకపోయే సరికి చాలా రూమర్స్ తెరపైకి వచ్చాయి.

అయితే ఈ మధ్య వేసవి కాలంలో స్టార్ హీరోలు సమ్మర్ వెకేషన్ కి ఫ్యామిలీ తో కలిసి యూరప్ లేదంటే ఇతర కోల్డ్ కంట్రీస్ కి వెళ్ళిపోయి అక్కడ ఒక నెలరోజులు గడిపేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా వేసవిలో అలా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చిరంజీవి యూరప్ వెళ్ళారనే ప్రచారం తెరపైకి వచ్చింది.

అయితే ఆయన ఫ్యామిలీతో యూరప్ వెకేషన్ కి వెళ్లలేదని, భోళా శంకర్ టీమ్ తో కలిసి స్విడ్జర్లాండ్ టూర్ వెళ్ళారని క్లారిటీ వచ్చింది. ఫ్యామిలీని కూడా ఈ టూర్ తీసుకొని వెళ్ళారంట. అదే సమయంలో ఈ టూర్ లో భోళా శంకర్ సినిమాకి సంబంధించి రెండు సాంగ్స్ ని కూడా చిత్రీకరించే ప్లాన్ చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం తన స్విడ్జర్లాండ్ టూర్ ని కన్ఫర్మ్ చేస్తూ ట్విట్టర్ లో ఫోటోలు పంచుకున్నారు. భోళా శంకర్ షూటింగ్ నిమిత్తం స్విడ్జర్లాండ్ వచ్చినట్లు కన్ఫర్మ్ చేశారు. స్విట్జర్లాండ్ కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట ఎంతో ఆహ్లాదంగా జరిగింది.

ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను. త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు షూటింగ్ కి సంబందించిన లొకేషన్ ఫోటోలని కూడా పంచుకున్నారు. ఇవి ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలతో మెగాస్టార్ చిరంజీవి శతజయంతి వేడుకలలో పాల్గొనలేకపోవడానికి కారణం ఏంటి అనేది క్లారిటీ వచ్చింది.