చిరు నోట స్టార్ హీరోల పేర్లు.. నోరెళ్లబెట్టిన స‌మంత‌

ఆరుప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తూ కుర్ర‌కారుకు పోటీ ఇస్తున్న స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. సినిమాల ద్వారానే కాక ముఖ్య అతిథిగా వేదిక‌ల‌పై ఆయ‌న చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. రీసెంట్‌గా బిగ్ బాస్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా వ‌చ్చిన చిరంజీవి.. సోహైల్ మేన‌రిజాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ మెగాస్టార్ ఈజ్ మెగాస్టార్ అని నిరూపించాడు. అలానే ఆ మ‌ధ్య సామ్ జామ్ ప్రోగ్రాంకి హాజ‌రు కాగా, అందుకు సంబంధించి ఇటీవ‌ల ప్రోమో విడుద‌ల చేశారు. ఆ ప్రోమోలో స‌మంత చిరంజీవిని మీ ఫ్రిజ్‌లో ఉండే కామ‌న్ వ‌స్తువు అంటే త‌న‌దైన శైలిలో కామెడి చేశారు.

ఇక తాజాగా సామ్ జామ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చిరంజీవి ఎపిసోడ్‌కు సంబంధించి మ‌రో ప్రోమో విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. వైవా హ‌ర్ష‌.. మీరు ఎన్నో హిట్ సినిమాలు చేశారు.. ఒకవేళ అవి రీమేక్ చేయాలంటే మీ రోల్ ఎవరు చేస్తే బాగుంటుంది చెప్పండి” అని అడిగగా, దానికి స్పందించిన చిరంజీవి .. చరణ్, తారక్, బన్నీ, రవితేజ, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్ కూడా అంటూ స్టార్ హీరోల పేర్లు వ‌రుస‌గా చెప్పాడు. మెగాస్టార్ మాట‌ల‌కి స‌మంత స్ట‌న్ అయి నోరెళ్ల‌పెట్టింది

చిరుతో స‌మంత చేసిన సంద‌డికి సంబంధించిన ప్రోగ్రాం క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ షో కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అలానే చిరు ప్ర‌స్తుతం న‌టిస్తున్న ఆచార్య సినిమా కోసం కూడా క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ చూస్తున్నారు. ఇటీవ‌ల ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కాగా, మ‌రి కొద్ది రోజుల‌లో పూర్తి కానున్న‌ట్టు స‌మాచారం. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రం త‌ర్వాత లూసిఫ‌ర్, వేదాళం రీమేక్ చిత్రాలు చేయ‌నున్నాడు చిరు.