ప్రభాస్ – మహేష్ ఓవర్ సీస్ లో తోపుగాళ్ళు అనుకున్న టైమ్ లో చిరంజీవి రికార్డ్ కొట్టేశాడు !

ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ .. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ ఉన్న హీరో. బాహుబలి సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్ గా పాపులారిటీ ని సంపాదించుకున్న ప్రభాస్ కి ఇప్పుడు దేశ విదేశాలలో అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇక సాహో సినిమా ఇక్కడ ఫ్లాప్ అయినా ఇతర దేశాలలో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అంతేకాదు సాహో సినిమాతో ప్రభాస్ కి ఫ్యాన్స్ అయిన వాళ్ళూ కూడా ఉండటం విశేషం. ఇక ప్రస్తుతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 4 పాన్ ఇండియన్ సినిమాలలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కారణంగా ప్రభాస్ సినిమాలకి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. అందుకే ప్రభాస్ సినిమాలకి ఓవర్సీస్ లో భారీగా రేటు వస్తుంది. ఇక మహేష్ బాబు గత మూడు నాలుగేళ్ళుగా వరసగా బ్లాక్ బస్టర్స్ సినిమాలతో మంచి ఊపు మీదున్నాడు. అందుకే మహేష్ బాబు సినిమాలకి ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంది. మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుందంటే అక్కడ భారీ మొత్తం చెల్లించి రైట్స్ దక్కించుకోవడానికి పలువురు పోటీ పడుతున్నారు. కాగా ఇప్పుడు ప్రభాస్, మహేష్ బాబు లకి ధీటుగా మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య బిజినెస్ జరుగుతోందని సమాచారం.

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా మే 13 న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆచార్య బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుందని చెప్పుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నైజాం హక్కులు రూ.42 కోట్లకు అమ్ముడు పోయాయి. వరంగల్ శ్రీను ఈ రైట్స్ ను ఇప్పటికే సొంతం చేసుకున్నాడు. మరోవైపు.. ఆంధ్రా సీడెడ్ కలిపి రూ.60 కోట్లకు పైగానే బిజినెస్ జరిగిందని సమాచారం. ఇక ఓవర్సీస్ లో రూ.20 కోట్లకు పైగానే కోట్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదే గనక నిజమైతే మెగాస్టార్ స్టామినా ఏంటో అందరికీ ఈ దెబ్బతో మళ్ళీ తెలుస్తుంది.