Chiranjeevi : మరొకసారి ఠాగూర్ లాంటి సినిమా చేయబోతున్న మెగాస్టార్…!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత జోరు పెంచి వరుస సినిమాలు చేస్తున్నారు. ఆచార్య సెట్ లో ఉండగానే కొత్త ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టేసాడు. ఇక మెగాస్టార్ కెరీర్ లో బెస్ట్ చిత్రాలలో ఒకటి ఠాగూర్ అని చెప్పొచ్చు. ఆ సినిమా సందేశాత్మక చిత్రమే అయినా కమర్షియల్ హిట్ సాధించింది.

ఇక ఈ సినిమా తర్వాత మరో సందేశాత్మక చిత్రం స్టాలిన్ సినిమా తీసినా ఆశించినంత విజయం సాధించలేదు. ఆ త‌ర‌వాత చిరు సందేశాల జోలికి వెళ్ల‌లేదు. అయితే ఇప్పుడు `ఠాగూర్‌ `లాంటి మ‌రో క‌థ దొరికింది. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో చిరు ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డి.వి.వి దాన‌య్య నిర్మాత‌. ఇది `ఠాగూర్‌` టైపు క‌థ‌ని తెలుస్తోంది. బ‌ల‌మైన సందేశాన్ని ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ విష‌యాల‌తో చెబుతూ స్క్రిప్టు రెడీ చేశాడ‌ట వెంకీ కుడుముల‌.

జూన్‌లో ఈ సినిమాని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. జులైలో షూటింగ్ మొద‌లు కానుంది. ప్ర‌స్తుతం చిరంజీవి చేతిలో మూడు సినిమాలున్నాయి. ‘భోళా శంక‌ర్‌’, ‘గాడ్ ఫాద‌ర్‌’, ‘వాల్తేరు వీర‌య్య‌’ సెట్స్‌పై ఉన్నాయి. ‘భోళా శంక‌ర్‌’, ‘గాడ్ ఫాదర్‌’ జులై నాటికి ముగింపుకు వ‌చ్చేస్తాయి. అందుకే వెంకీ కుడుముల సినిమాని జులైలో మొద‌లెట్టాల‌ని భావిస్తున్నారు.