సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటనకి అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం పట్ల పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇటు టాలీవుడ్ ప్రముఖులు అటు బాలీవుడ్ ప్రముఖులు సైతం బన్నీకి సపోర్టుగా నిలబడుతున్నారు. తొక్కిసలాటలో అభిమాని చనిపోతే అందుకు హీరోని బాధ్యుడిని చేయడం నూటికి నూరు శాతం తప్పు అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
కొందరు సోషల్ మీడియా ద్వారా బన్నీకి తమ మద్దతు తెలియజేస్తే మరి కొందరు సెలబ్రిటీస్ బన్నీ ఇంటికి వెళ్లి అతనికి తమ మద్దతు తెలియజేస్తున్నారు. బన్నీ అరెస్టు అయిన తర్వాత చిరంజీవి, నాగబాబు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు పవన్ కళ్యాణ్ కూడా వెళతారు అని చెప్పారు కానీ అలా జరగలేదు.అయితే రామ్ చరణ్ మాత్రం ఇప్పటికీ తన మద్దతుని స్వయంగా గాని సోషల్ మీడియా ద్వారా గాని ప్రకటించకపోవడం గమనార్హం.
పైగా అందరూ బన్నీ కోసం మాట్లాడుతుంటే రామ్ చరణ్ మాత్రం సోషల్ మీడియా ద్వారా బర్త్డే విషెస్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చరణ్ రాణా కి బర్త్డే విషెస్ చెప్పిన సమయంలో రాణా బన్నీ దగ్గర ఉండడం గమనార్హం.అయితే చరణ్ కావాలని బన్నీని ఇగ్నోర్ చేస్తున్నాడా లేదంటే బిజీగా ఉండడం వల్ల బన్నీ దగ్గరికి రాలేదా అంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినబడుతున్నాయి.
మొన్న సాయి దుర్గ తేజ్ ఈవెంట్ కి వెళ్ళటానికి టైం ఉన్న రామ్ చరణ్ కి ఈరోజు బన్నీ దగ్గరికి రావడానికి టైం లేదా అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. బిజీ షెడ్యూల్ మూలంగా వెళ్ళలేదేమో త్వరలోనే వెళ్తాడేమో అంటున్నారు మరో వర్గం వారు. బన్నీ రిలీజ్ అయిన తర్వాత కూడా చిరంజీవి బన్నీని కలవడానికి వెళ్లకపోవడం పట్ల మరిన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి భార్య సురేఖ మాత్రం బన్నీ విడుదల తర్వాత అతడిని కలిసి భావోద్వేగానికి గురయ్యారు.
Wishing my dearesthulk @RanaDaggubati a very Happy Birthday and a wonderful year ahead 😊
— Ram Charan (@AlwaysRamCharan) December 14, 2024