ఎక్కడో మొగల్తూరు నుంచి వచ్చి స్వయంకృషితో సినిమాలలో ఎదిగి, మెగాస్టార్ గా మారి ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న వ్యక్తి చిరంజీవి. కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన నటుడు చిరంజీవి. ఇప్పుడు ఆయన వారసుడిగా రామ్ చరణ్ ఆస్థానాన్ని భర్తీ చేస్తున్నారు 2007లో చిరుత చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన రామ్ చరణ్ రెండో చిత్రంతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేసిన మగధీర సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది.
ఇక ధ్రువ, రంగస్థలం వంటి సినిమాలతో రామ్ చరణ్ స్టార్ హీరోల సరసన చేరాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ కూడా ఆయన రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీతో సంక్రాంతికి మనం ముందుకి వస్తున్నారు. అయితే రామ్ చరణ్ ప్రయాణంలో చిరంజీవి పాత్ర ఎంతో ఉంది. కథలతో పాటు దర్శకుల ఎంపికలో కూడా చిరంజీవి కీలకంగా వ్యవహరిస్తారు, అలాగే వారిద్దరూ తండ్రి కొడుకులుగా కాకుండా ఆప్త మిత్రులుగా మసలుకుంటారు. అయితే ఒకానొక సందర్భంలో రాంచరణ్ తండ్రిని మోసం చేశాడంట.
ఈ విషయం స్వయంగా చిరంజీవి చెప్పటం విశేషం. ఆ మధ్య ఒక టెలివిజన్ షోలో సాయి పల్లవి, రాణా, చిరంజీవి పాల్గొన్నారు. అప్పుడు రాణా చిన్నతనంలో చిరంజీవి గారి ఇంట్లో జరిగిన టెలిస్కోప్ ఇన్సిడెంట్ చెప్పి పాత జ్ఞాపకాన్ని నెమరు వేసుకున్నారు. అప్పుడు చిరంజీవి దానికి కంటిన్యూషన్ గా నేను టెలిస్కోప్ క్యాప్ తీయమంటే వాడు మా ఇంటికి ఉన్న గ్రిల్ తీశాడు. రాత్రంతా వాళ్లు చదువుకుంటున్నారని మేము అనుకునే వాళ్ళం.
కానీ వాళ్ళు కిటికి గ్రిల్ తీసేసి బయటికి వెళ్లిపోయేవారు, ఇష్టం వచ్చినట్లు తిరిగి మళ్లీ ఏమీ తెలియనట్లు గదిలోకి వచ్చేసేవారు. వీళ్లిద్దరూ చేస్తున్న మోసం తెలుసుకోవడానికి నాకు రెండు నెలల సమయం పట్టింది అంటూ ఆనాటి ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి చెప్పుకొచ్చారు చిరంజీవి. పైకి ఎంతో బుద్ధిమంతుడులా కనిపించే రాంచరణ్ కూడా ఇలాంటి చిలిపి పనులు చేసేవాడా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.