Beast : బీస్ట్ సినిమా చూసేవారికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన థియేటర్ యాజమాన్యం…?

Beast : తమిళ నాట వరుస విజయలతో అగ్ర హీరోలలో ఒకరుగా వున్నారు విజయ్.ఇక అభిమానులలో ఆయనకు వున్న క్రేజ్ అందరికి తెలిసిందే. తెలుగు లో కూడా విజయ్ సినిమాలు విడుదల అయ్యి మంచి ఆదరణ పొందుతున్నాయి. తాజాగా విజయ్ నటించిన విజిల్ సినిమా తెలుగు లో కూడా మంచి ఆదరణ పొందింది.ఇప్పుడు బీస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

విజయ్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం బీస్ట్. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.మామూలుగానే విజయ్ సినిమా అంటే తమిళ నాట అభిమానుల హంగామా మాములుగా ఉండదు. అందులోను భారీ అంచనాల మధ్య వచ్చిన బీస్ట్ సినిమా చూడటానికి అభిమానులు ఉదయం నుంచే థియేటర్ ల వద్ద క్యూ కట్టారు.తమిళనాడు లో బీస్ట్ సినిమా చూడటానికి వచ్చిన అభిమానులకు అదిరిపోయే ఆఫర్ లను కూడా ఇచ్చింది థియేటర్ యాజమాన్యం.

వీక్షకుల కోసం ఏకంగా పెట్రోల్, ఫుడ్ కూడా ఉచితంగా అరేంజ్ చేస్తున్నారు.చెన్నైలోని విరుదునగర్‌లో ఉన్న రాజలక్ష్మి, అమృతరాజ్ థియేటర్లలో’బీస్ట్’ ఫస్ట్ డే ఫస్ట్‌ టిక్కెట్‌ను కొనుగోలు చేసిన వారిని అక్కడి ఫ్యాన్స్ ఇలాంటి ఆఫర్లతో ఖుషీ చేస్తున్నారు. బీస్ట్ మొదటి షో కోసం 5 టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి థియేటర్లలో 1 లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నారు.ఈ థియేటర్స్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ధర 500 ఉంది. ఈ రేటుతో కనీసం అయిదు టికెట్స్ కొన్నవారికి లీటర్ పెట్రోల్ ఇస్తామని ప్రకటించారు. విజయ్ స్టార్ హీరో అవ్వడం వల్ల టికెట్లు అయ్యిపొయాయి..ఆ ఆఫర్ వల్ల సినిమా క్రేజ్ మరింత పెరిగింది.