విజయ్ దేవరకొండను మిస్ అవుతున్న తల్లి.. చార్మీ పోస్ట్ వైరల్

Charmme about Madhavi Devarakonda

విజయ్ దవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. విజయ్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం అంటే దాని అంచనాలు ఎలా ఉంటాయి.. జనాలు ఏ మేరకు ఎదురుచూస్తున్నారో మొన్ననే తెలిసిపోయింది. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి సంచలనం రేగింది. ఫస్ట్ లుక్ విడుదలైన కొన్ని గంటల్లో సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. భారీ భారీ ప్లెక్స్‌లు కట్టేసి పాలాభిషేకాలు చేయించేశారు. ఇంకొంత మంది అభిమానం హద్దులు దాటేసింది.

Charmme about Madhavi Devarakonda
Charmme about Madhavi Devarakonda

లైగర్ సినిమా టైటిల్ అందరిలోనూ బాగా రీచ్ అయింది. రౌడీ అభిమానులు ఏకంగా లైగర్ టైటిల్‌ను పచ్చబొట్టుగా పొడిపించుకున్నారు. ఈ అభిమానాన్ని చూసి విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా కోసం విజయ్ భారీగానే కష్టపడుతున్నాడు. ఎన్నడూ లేని విధంగా శరీరాకృతిని మార్చుకుంటున్నాడు.. సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. అలా ఇప్పుడు విజయ్ లైగర్ షూటింగ్ కోసం రెడీ అయ్యాడు. ముంబైకి వెళ్లాడు.

ఇక విజయ్ అలా ఇంటికి దూరంగా అవ్వడంతో అతని తల్లి మాధవి దేవరకొండ ఎమోషనల్ అయింది. అదే సమయంలో లైగర్ సినిమాకు సంబంధించిన పోస్ట్ పెట్టింది. చార్మీ, పూరి, విజయ్ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ. 2021లో మీకు మంచి జరగాలని కోరింది. దానిపై ఛార్మీ స్పందించింది. లవ్యూ మాధవి.. మిస్సింగ్ యూ అంటూ పోస్ట్ పెట్టేసింది. గతవారమే చార్మీ విజయ్ దేవరకొండ ఇంట్లో డిన్నర్ చేసింది. మాధవి ఎంతో బాగా హోస్ట్ చేసిందంటూ డిన్నర్ పార్టీ గురించి చార్మీ చెప్పుకొచ్చింది.