పూరి జ‌గ‌న్నాథ్‌ డైరెక్షన్ లో ఛార్మి ” లేడీ ఓరియెంటెడ్ “..?

టాలీవుడ్ లో ఛార్మి హీరోయిన్ గా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. నీతోడు కావాలి సినిమాతో టాలీవుడ్ కి ఎంటరైన ఛార్మి తెలుగు తో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలుచేసి మంచి హిట్స్ ని అందుకుంది. బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన బుడ్డా హోగా తేరే బాప్.. ఛార్మి కి ప్రత్యేకమైన సినిమా. ఇక తెలుగులో నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, ఎన్.టి.ఆర్, నితిన్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసి ఒక వెలుగు వెలిగింది.

HD wallpaper: charmi, kaur | Wallpaper Flare

అయితే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించిన జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. తెలుగులో ఈ సినిమా హీరోయిన్ గా ఛార్మి కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు ఈ సినిమాతో టాలీవుడ్ లో నిర్మాతగాను మారింది. ఈ సినిమా తర్వాత ఛార్మి ఎందుకు సినిమాలు మానేసింది అన్నది ఇప్పటి వరకు ఫ్యాన్స్ కి అర్థం కావడం లేదు. అయితే ఛార్మి మాత్రం దాదాపు హీరోయిన్ గా 15 సంవత్సరాలు అన్ని ప్రధాన భాషల్లో నటించాను. ఇక మళ్ళీ స్క్రీన్ మీద కనిపించే ఉద్దేశ్యం లేదు అని డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది.

కాని ఇప్పటికీ తరగని అందం తో ఛార్మి ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. దాంతో ఇప్పటికే పలుసార్లు ఛార్మి ని డైరెక్ట్ గా మళ్ళీ మిమ్మలిని హీరోయిన్ గా చూడాలనుకుంటున్నాము. మాకోసం ఒక్క సినిమా చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఛార్మి అభిమానుల కోసం ఒక్క సినిమా చేస్తే బావుంటుంది. కాగా తాజాగా ఒక కొత్త టాక్ వినిపిస్తోంది. లాక్ డౌన్ లో పూరి 7-8 కథ లు సిద్దం చేశాడట. అలాగే వెబ్ సిరీస్ కి కాన్సెప్ట్స్ రాసి పెట్టుకున్నాడట. కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట పూరి.

Vijay Deverakonda starrer with director Puri Jagannadh titled Fighter |  Entertainment News,The Indian Express

అయితే సినిమాల కోసం పూరి రాసిన కథ లలో మెగాస్టర్, పవర్ స్టార్, సూపర్ స్టార్ మహేష్, బాలయ్య లాంటి టాలీవుడ్ స్టార్స్ తో పాటు ఒక లేడీ ఓరియెంటెడ్ కథ కూడా రాసినట్టు తెలుస్తుంది. మరి ఈ కథ ఛార్మి అభిమానులందరూ ఆశపడుతున్నట్టు పూరి.. ఛార్మి తో తెరకెక్కిస్తే బావుంటుందని చర్చించుకుంటున్నారట. నిజంగా అదే జరిగితే పక్కా బ్లాక్ బస్టర్ ఖాయమని భావించవచ్చు. ఇక ప్రస్తుతం ఛార్మి.. పూరి తో కలిసి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.