భారీ ఏక్షన్ తో స్టార్ట్ చేయబోతున్న చరణ్.?

మెగా లెగసి క్యారియర్ గ్లోబల్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన నెక్స్ట్ భారీ చిత్రం “గేమ్ చేంజర్” లో బిజీగా ఉన్నాడు. అయితే ఇండియన్ సినిమా దగ్గర ఇద్దరు దిగ్గజ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే శంకర్ లాంటి దర్శకులతో నటించిన ఏకైక హీరోగా అయితే చరణ్ నిలవగా..

ఇపుడు శంకర్ తో చేస్తున్న గ్రాండ్ స్కేల్ సినిమాపై అనేక అంచనాలు అయితే నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం ఎప్పుడు నుంచో షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ లేటెస్ట్ గా మాత్రం భారీగా డిలే అయ్యింది. దీనితో ఈ కొత్త షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా.

ఇప్పుడు దీనిపై అయితే మెగా కాంపౌండ్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు వచ్చేసింది. కాగా ఈ అప్డేట్ ప్రకారం అయితే నెక్స్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో వచ్చే వారంలో స్టార్ట్ చేస్తుండగా ఈ షూటింగ్ అయితే భారీ ఏక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో చాలా రోజుల తర్వాత అయితే షూటింగ్ స్టార్ట్ కాబోతుంది అని చెప్పాలి.

ఇంకా ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య తదితరులు నటిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం చరణ్, శంకర్ కాంబినేషన్ లో 15వ సినిమాగా తెరకెక్కుతూ ఉండగా దిల్ రాజు తమ ప్రొడక్షన్ బ్యానర్ లో 50వ సినిమాగా భారీ వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు.