Ram Charan: ఉక్రెయిన్ లో తన సెక్యూరిటీ గా ఉన్న వ్యక్తికి సహాయం చేసిన చరణ్!

Ram Charan: ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ ల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో అక్కడి వాతావరణం మొత్తం భయాందోళనగా కనిపిస్తుంది. అక్కడ ఇరుక్కుపోయిన విదేశీయులంతా తమ తమ దేశాలకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది అక్కడ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కూడా జరిగింది.

దీంతో తాజాగా ప్రమోషన్స్ భాగంలో చరణ్ కొన్ని విషయాలు పంచుకున్నాడు. అక్కడ తనకు తెలిసిన వ్యక్తులకు ఆర్థిక సహాయం చేశానని అన్నాడు. అక్కడ యుద్ధం మొదలైన తరువాత.. తన షూటింగ్ సమయంలో తనకు సెక్యూరిటీగా ఉన్న వ్యక్తితో మాట్లాడానని.. ఆయన తండ్రి 80 ఏళ్ల వ్యక్తి గన్ పట్టుకొని యుద్ధంలో పాల్గొంటున్నారని అన్నాడు. ఇక ఆ సెక్యూరిటీ గాడ్ ఫ్యామిలీకి కొంత వరకు తన వంతు సహాయం చేశానని అన్నాడు.