ఆగిపోయిన సినిమా గురించి ఇప్పుడెందుకు చర్చ.? హీరోకి టైమ్ లేదు. దర్శకుడికేమో తీరిక లేదు.! ఔను, హీరో సినిమాల్ని వదిలేసి, రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. దర్శకుడేమో ఇంకో సినిమా చూసుకున్నాడు.
కానీ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మాత్రం గాసిప్స్ కాలమ్స్‌లో కనిపిస్తూనే వుంది. పవన్ కళ్యాణ్ సినిమా మరి.! పైగా, హరీష్ శంకర్ దర్శకుడు. ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ కదా, ఆ మాత్రం వేడి వుంటుంది.
ప్రస్తుతం రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నాడు హరీష్ శంకర్. పనిలో పనిగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేసేస్తున్నాడట. తొలుత ఒరిజినల్ ‘భవదీయుడు భగత్ సింగ్’ చేయాలనుకున్నా, మధ్యలోకి రీమేక్ వచ్చిపడింది.
‘భగత్ సింగ్’ టైటిల్ అలాగే వుంచి, ‘ఉస్తాద్’ జోడించారు. కొంత పార్ట్ షూటింగ్ కూడా జరిగింది. కానీ, అది చాలా చాలా తక్కువ. సో, మార్పులు చేర్పులు తేలికేనని భావిస్తున్నారట.
నిర్మాణ సంస్థకి తొందర లేదు, ఇంకో ప్రాజెక్టులో పడ్డాడు గనుక దర్శకుడికీ టెన్షన్ లేదు. హీరో సంగతి సరే సరి. అభిమానులకే, ఈ ప్రాజెక్టుపై అంచనాలున్నాయి. కానీ, రీమేక్ సినిమా.. అన్నదే వాళ్ళకున్న పెద్ద సమస్య. మార్పులు చేర్పులు చేసి, ఒరిజినల్.. అంటే, హైప్ మళ్ళీ పెరిగిపోతుంది.