విజయ్ దేవరకొండ దిల్ రాజు కాంబో.. ప్లాన్ చేంజ్?

గత ఏడాది లైగర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలి అనుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత చేయబోయే సినిమాలు కూడా అదే తరహాలో ఉండాలి అని అనుకున్నాడు. కానీ ఆ సినిమా ఊహించిన విధంగా ఎదురు దెబ్బ కొట్టడంతో మళ్లీ విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఇండియా అంచనాలను కాస్త తగ్గించుకొని లోకల్ దర్శకులతో ఎక్కువగా సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నట్లు అర్థమవుతుంది.

ఇప్పటికే గౌతమ్ తిన్ననురితో ఒక సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు మరో టాలీవుడ్ దర్శకుడు పరశురామ్ తో కూడా సింపుల్ స్టోరీని లైన్ లోకి తీసుకు వస్తున్నట్లు సమాచారం. ఇదివరకే వీరి కలయికలో వచ్చిన గీత గోవిందం ఎలాంటి సక్సెస్ ని ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మళ్లీ సీక్వెల్ తీయబోతున్నారు అని ఆ మధ్య టాక్ కూడా వచ్చింది.

గీత ఆర్ట్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు ఊహించిన విధంగా పరశురామ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లోకి దిల్ రాజు రావడంతో.. దిల్ రాజు కొత్త సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. త్వరలోనే విషయంలో అధికారికంగా కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు.

అయితే విజయ్ దేవరకొండ ఈ విధంగా నిర్మాతను ఎందుకు మార్చాడు అసలు గీత గోవిందం సీక్వెల్ ఉందా లేదా అనే విషయంలో మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు సుకుమార్ తో కూడా విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ ఇప్పట్లో సుకుమార్ పుష్ప 2 ఫినిష్ చేసేలా లేడు కాబట్టి ఆ సినిమాలో లోపు విజయ్ వీలైనంత ఎక్కువ ప్రాజెక్టులు ఫినిష్ చేస్తాడు అని పిలుస్తోంది.