నెట్‌ఫ్లిక్స్‌లో ‘చంద్రముఖి-2’

హిట్టయిన సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుందంటే జనాల్లో అంచనాలుండటం సహజమే. అందులోనూ ఎవర్‌గ్రీన్‌ లాంటి చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌ అంటే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. పైగా సినిమాల్లో దెయ్యాలకు శరీరాన్ని అప్పుగా ఇచ్చే రాఘవ లారెన్స్‌ హీరోగా చేయడంతో అటు తెలుగు ఆడియెన్స్‌లోనూ ఈ సీక్వెల్‌పై తిరుగులేని అంచనాలు క్రియేట్‌ అయ్యాయి.

టీజర్‌, ట్రైలర్‌లు సో సోగా అనిపించినా.. కథ పరంగా ఏదైనా కొత్తదనం ఉంటుందేమో అన్న ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌లకు వెళ్లిన ప్రేక్షకులను దర్శకుడు పి.వాసు తీవ్రంగా నిరాశపరిచాడు. కథ, కథనం, టేకింగ్‌ ఏది కూడా కొత్తగా లేకపోవడం.. పై పెచ్చు గ్రాఫిక్స్‌ దరిద్రంగా ఉండటంతో జనాలు చంద్రముఖి`2 సినిమాను తిప్పి కొట్టారు. అసలు లారెన్స్‌ ఈ కథను ఎలా ఒప్పుకున్నాడో అతనికే తెలియాలంటూ ఆయన ఫ్యాన్స్‌ తీవ్రంగా నిరాశపడ్డారు.

అయితే పోటీగా ఎలాంటి సినిమాలు లేకపోవడంతో కొంత వరకు ప్రొడ్యూసర్‌లకు ఈ సినిమా నష్టాలు మిగిల్చింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను ఫిక్స్‌ చేసుకున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్‌ 27 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే చాన్స్‌ ఉంది.

నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఈ సినిమా హక్కులను రిలీజ్‌కు ముందే కొనుక్కోవడంతో నిర్మాతలకు కాస్త కలిసొచ్చింది. చంద్రముఖి సినిమాకున్న క్రేజ్‌తో సీక్వెల్‌ కోసం నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ భారీ ధరకు డిజిటల్‌ హక్కులను దక్కించుకుంది. కంగనా రనౌత్‌ కీలకపాత్ర పోషించిన ఈ సినిమాకు ఆస్కార్‌ గ్రహిత ఎమ్‌.ఎమ్‌ కీరవాణి స్వరాలు కూర్చాడు. డబ్బులను మంచి నీళ్లలా ఖర్చు పెట్టే లైకా సంస్థ ఈ సినిమాను నిర్మించింది.