ఆ హీరోయిన్ రీఎంట్రీ ఇవ్వడంతోనే సమంతకు విడాకులు ఇచ్చిన చైతూ..?

టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఎంతో పేరు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య సమంత ఎవరూ ఊహించని విధంగా విడాకులు ప్రకటన చేసి ఒక్కసారిగా అభిమానులను షాక్ కి గురిచేశారు. అయితే వీరు విడాకులు తీసుకోవడానికి వివిధ రకాల కారణాలను తెలియజేస్తూ విడాకుల విషయంలో సమంతదే తప్పు అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సమంతతో ప్రేమలో పడటం కన్నా ముందుగా నాగచైతన్య మరొక స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ తో నాగచైతన్య కొద్ది రోజుల పాటు డేటింగ్ లో కూడా ఉన్నారని వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని భావించారు కానీ కొన్ని కారణాల వల్ల వీరి పెళ్లి ఆగిపోయిందనీ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఆ హీరోయిన్ తో బ్రేకప్ చెప్పుకున్న తర్వాతనే నాగచైతన్య సమంత ప్రేమలో పడ్డారని,ఇలా వీరిద్దరు పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా 4 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న సమంత నాగచైతన్య చివరికి పలు మనస్పర్థల కారణంగా విడాకులు ప్రకటించారు.

అయితే గతంలో నాగచైతన్యతో డేటింగ్ చేసిన హీరోయిన్ ప్రస్తుతం ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం చేత నాగచైతన్య సమంత మధ్య గొడవలు తలెత్తాయని ఈ హీరోయిన్ కారణంగానే వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకుని విడాకుల వరకు దారి తీసిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో? లేదో తెలియాల్సి ఉంది.