టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నాగచైతన్య సమంత కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉండి పెద్దలను ఒప్పించి ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇలా జీవితంలో మూడు సంవత్సరాల పాటు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ దంపతులు చివరికి విడాకులు తీసుకొని విడిపోయారు.వీరిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్ధలు కారణంగా వీరు విడిపోయారు అయితే వీరి విడాకులకు గల కారణం ఏంటి అనే విషయం మాత్రం ఇప్పటివరకు తెలియలేదు.
ఇకపోతే తాజాగా నాగచైతన్య సమంత గురించి సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతుంది త్వరలోనే వీరిద్దరు విడాకులు రద్దు చేసుకోబోతున్నారని తిరిగి ఒకటి కాబోతున్నారని వార్త వైరల్ అవుతుంది.సమంత ప్రాణాంతకరమైన మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ నాగచైతన్య,నాగార్జున గాని ఈ విషయంపై స్పందించలేదు కానీ వీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోయినా వ్యక్తిగతంగా దగ్గరుండి సమంత బాగోగులు చూసుకుంటున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే సమంత ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న తరుణంలో ఆమె కూడా తన విడాకులను రద్దు చేసుకోవాలని ఆలోచించారట ఇక సమంత మాత్రమే కాకుండా నాగచైతన్య కూడా తిరిగి ఇద్దరు కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారని త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ ఇది జరిగే పనేనా అంటూ సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.