RRR Movie: రాజమౌళి లేకుండా ఆర్ ఆర్ ఆర్ ని ఊహించుకోలేం..: ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు

RRR Movie: ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెర తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుండడంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తుండడంతో ఈ చిత్రంపై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో నూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఇదిలా ఉండగా ఇండియా ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాను పూర్తిగా ఫిక్షన్ స్టోరీ తరహాలో చూపించ పోతున్నట్టు తెలుస్తోంది. ఐతే స్నేహం ప్రధానాంశంగా సాగే ఈ మూవీని డైరెక్టర్ రాజమౌళి కాకుండా వేరొకరితో చేయాల్సి వస్తే ఏ డైరెక్టర్ తో చేస్తారు అన్న ప్రశ్నకు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది. రాజమౌళి లేకుండా ఆర్ ఆర్ సినిమా తీసేవాళ్ళం కాదని వారు తెలిపారు. అసలు జక్కన్న లేకుండా ఆ సినిమానే లేదు అని, అలాంటి ఆలోచనలు ఏ డైరెక్టర్ కీ రావని వారు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా అలాంటి సినిమాలు రాజమౌళి తప్ప ఇంకెవరూ తీయలేరని వారు స్పష్టం చేశారు.

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ హుషారైన పాట ఎత్తర జెండా వీడియోను ఇటీవలే యూట్యూబ్‌లో విడుదల చేయగా, ప్రస్తుతం ఆ పాట ట్రెండింగ్ గా మారింది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే యూఎస్‌లో ఎన్టీఆర్ ఓ అభిమాని ఏకంగా థియేటర్ నే బుక్ చేయడం విశేషం. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనే ముందు రోజే స్పెషల్ షోస్ వేయనున్నట్టు సమాచారం.