మహేష్ డైరెక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అయినా హిట్ మూవీ తీస్తాడా?

Can Murugadoss give a hit movie to NTR?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్.మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాను ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. 1920 ల కాలం నాటి కథగా పేట్రియాటిక్ నేపథ్యంలో భారీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది వేసవి తరువాత రిలీజ్ కి సిద్ధమవుతోంది.

Can Murugadoss give a hit movie to NTR?
Can Murugadoss give a hit movie to NTR?

ఇక దీని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. ఇప్పటికే దానికి సంబంధించి కథాకథనాలతో పాటు పూర్తి స్క్రిప్టు సిద్ధమైందని, అందుతున్న సమాచారాన్ని బట్టి ఆ సినిమా సంక్రాంతి తర్వాత పట్టాలెక్కనుందని అంటున్నారు. ఇక దీని అనంతరం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. ఆపై ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ తో కూడా ఆయన ఓ సినిమా చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అందుతున్న సమాచారాన్ని బట్టి ఇటీవల ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా తన నివాసంలో కలిసిన మురుగుదాస్ ఆయనకు ఒక అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ స్టోరీని వినిపించారని అది విన్న ఎన్టీఆర్ ఎంతో ఎగ్జైట్ అయి తన తదుపరి కమిట్మెంట్స్ పూర్తయిన అనంతరం దీనిని పట్టాలెక్కిద్దామని మాట ఇచ్చినట్లు చెబుతున్నారు.

టాలీవుడ్ కి చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఎంతో భారీగా ప్రతిష్టాత్మక లెవల్లో నిర్మించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అదిరిపోతుందని అలానే మురుగుదాస్ మార్క్ స్టైల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ వంటివి కూడా ఈ సినిమాలో ఉంటాయని అంటున్నారు. గతంలో సూపర్ మహేష్ బాబు తో తెరకెక్కించిన స్పైడర్ తో భారీ పరాజయాన్ని మూట గట్టుకున్న మురగదాస్ ఆ తర్వాత విజయ్ తో తీసిన సర్కార్, రజినీకాంత్ తీసిన దర్బార్ సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాలి.