నేను పెళ్లి చేసుకునే సమయానికి తనుకు ఒక బాబు ఉన్నారు.. అసలు విషయం బయటపెట్టిన బ్రహ్మాజీ!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా,విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు బ్రహ్మాజీ. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో అగ్ర హీరోల సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఈ విధంగా బ్రహ్మాజీ పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మొదటిసారి తన వ్యక్తిగత విషయాలను తెలిపారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను సినిమాలపై మక్కువతో చెన్నైలోని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఉన్న సమయంలో తనకు ఒక బెంగాలీ అమ్మాయితో పరిచయం ఏర్పడిందని తెలిపారు.ఇలా బెంగాలీ అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమ వరకు దారి తీసిందని ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని శివాజీ తెలిపారు.ఇకపోతే తనని నేను పెళ్లి చేసుకునే సమయానికి తనకు విడాకులు కూడా అయ్యాయని బ్రహ్మాజీ పేర్కొన్నారు.

ఈ విధంగా తనకు ఇదివరకే పెళ్లి జరగడం ఆ అమ్మాయికి ఒక కుమారుడు పుట్టిన తర్వాత విడాకులు అయ్యాయని ఈ సందర్భంగా ఈయన తెలిపారు.ఇలా మా పెళ్ళికి ముందే తనకు కొడుకు ఉండడంతో ఇక మరి మాకు పిల్లలు ఎందుకు అని భావించి పిల్లలు వద్దనుకున్నామని ఈ సందర్భంగా బ్రహ్మాజీ తనకు పిల్లలు లేకపోవడానికి గల కారణాన్ని తెలిపారు.ఇక ఆ అబ్బాయే ప్రస్తుతం పిట్టకథలు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.