మరో 15 రోజులలో కొత్త సంవత్సరం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నారు. ట్విట్టర్ ఇండియా ప్రతి రోజు సినిమా, రాజకీయం, క్రీడా ఇలు పలు రంగాలకి సంబంధించి టాప్ 10 జాబితాను ప్రకటిస్తూ వస్తుంది. ట్విట్టర్ లో ఎక్కువగా చర్చించిన వారు , పర్సన్స్ గురించి వెతికిన వారు, టాప్ రేటింగ్ సాంగ్స్ అంటూ జాబితాలు ప్రకటిస్తూ వస్తుంది. తాజాగా టాప్ 10 మ్యూజిక్ వీడియోల జాబితా విడుదల చేయగా ఇందులో బన్నీ సినిమాలకి సంబంధించి రెండు సాంగ్స్ ఉండడం విశేషం.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అల వైకుంఠపురములో అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. తమన్ చిత్రానికి సంగీతం అందించారు. ఆయన స్వరపరచిన సంగీతానికి ఓ రేంజ్‌లో అప్లాజ్ వచ్చింది. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశ విదేశాలలో ఈ సాంగ్‌కి టిక్ టాక్‌లు చేయడంతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఈ ఏడాదిలో వచ్చిన కొన్ని సినిమా పాటలు శ్రోతలని ఎంతగానో రంజింపజేశాయి. వాటిలో బన్నీ నటించిన అల వైకుంఠపురములోని “బుట్ట బొమ్మ” , “రాములో రాముల” పాటలు టాప్ 10లో నిలిచాయి.
బుట్టబొమ్మ పాటకు మూడో స్థానం దక్కగా, రాములో రాములా పాటకు 8వ స్థానం దక్కింది. దేశం మొత్తంలో ఈ ఏడాది విడుదలైన సినిమాలలో తెలుగు సినిమాకు సంబంధించిన రెండు పాటలు శ్రోతలని ఎంతగానో అలరించడం విశేషం. ఈ క్రెడిట్ బన్నీకి కూడా దక్కడంతో ఆయన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్.. పుష్ప అనే సినిమాతో బిజీగా ఉండగా ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంతోను రికార్డులు క్రియేట్ చేయాలని బన్నీ అనుకుంటున్నాడు.