కూతురికి స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చిన బ‌న్నీ..నెఫ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

అల్లు వార‌సులు అర్హ ఈ రోజు నాల్గ‌వ బ‌ర్త్ డే జ‌రుపుకుంటుంది. ఈ సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు, ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా చిన్నారికి సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక అర్హ తండ్రి అల్లు అర్జున్ త‌న లిటిల్ ఏంజెల్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డ‌మే కాదు స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఈ విష‌యాన్ని బ‌న్నీ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేయ‌గా.. ఫ్యాన్స్ ఆ పోస్ట్‌కు నెఫ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ రోజు ఉద‌యం త‌న కూతురితొ దిగిన ఫొటోని షేర్ చేస్తూ బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలిపిన అల్లు అర్జున్ కొద్ది సేప‌టి క్రితం ఓ గుర్రాన్ని బ‌హుమ‌తిగా ఇచ్చిన‌ట్టు పేర్కొన్నాడు. ఆ గుర్రంపై అర్హను కొద్దిసేపు స్వారీ చేయించి ఉత్సాహ‌ప‌రిచాడు. త‌న బ‌ర్త్ డే రోజు తండ్రి ఇచ్చిన బ‌హుమ‌తిని చూసి అర్హ చాలా సంతోషించింది. ఇక అంజ‌లి అంజ‌లి అంజ‌లి రీక్రియే‌ష‌న్ సాంగ్ కూడా కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేసి అభిమానుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

1990లో మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన అంజ‌లిలోని క్లాసిక్ సాంగ్ అంజ‌లి అంజ‌లి అంటూ సాగే పాట‌లో బేబి షామిలీ న‌టించింది. రీ క్రియేష‌న్‌లో అల్లు అర్హ మెరిసింది. త‌న ముఖ క‌వ‌ళిక‌లు,భావోద్వేగాల‌తో వావ్ అనిపించింది. ఇందులో అల్లు అర్హతో పాటు ఆమె సోదరుడు అల్లు అయాన్‌, తాతయ్యలు అల్లు అరవింద్‌, కేసీ శేఖర్‌ రెడ్డి సహా అల్లు అర్జున్‌ కూడా నటించడం విశేషం. ఈ పాటకు సినిమాటోగ్రాఫర్ సూర్య తేజ ముసునూరు ఛాయాగ్రహణం అందించారు.