అట్ల త‌ద్ది వేడుక‌లో బ‌న్నీ ఫ్యామిలీ.. ఫొటో వైర‌ల్

తెలుగు వారి ముఖ్య‌మైన పండుగ‌ల‌లో అట్ల త‌ద్ది ఒక‌టి. మ‌నం అట్ల త‌ద్దిగా పిలుచుకుంటే దేశ వ్యాప్తంగా క‌ర‌వా చౌత్ అనే పేరుతో సెల‌బ్రేట్ చేసుకుంటారు. ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది జ‌రుపుకోనుండ‌గా, ఆ రోజు ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగు వారికి వాయినాలిస్తారు. మ‌హిళ‌లు చేతులకు గోరింటాకు పెట్టుకోవ‌డం, చెట్లకు ఊయల కట్టి ఊగడం వంటివి చేస్తుంటారు. ఈ రోజు పెళ్లి కాని వారు మంచి భ‌ర్త రావాల‌ని పూజ‌లు చేస్తే, వివాహితులు త‌న భ‌ర్త ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటారు. త్రిలోక సంచారి నారదుడి ప్రోద్బలంతో శివుని తన పతిగా పొందడానికి పార్వతిదేవి తొలుత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. సౌభాగ్యం కోసం చేసుకోనే ఈ వ్ర‌తంలో పిల్ల‌లు పెద్ద‌లు ఉత్సాహంగా పాల్గొంటారు

అట్ల త‌ద్ది రోజు ముఖ్య విశేషం ఏమంటే ఆ రోజు పదిసార్లు ఊయల ఊగడం,పది రకాల పండ్లను తినడం, పదిమార్లు తాంబులం వేసుకోవడం. ఈ పండుగ వల్ల గౌరీదేవి అనుగ్రహం క‌లుగుతుంద‌ని, పుణ్యం ల‌భిస్తుంద‌ని న‌మ్ముతారు . న‌వంబ‌ర్ 3న దేశ మంతా ఈ వేడుక‌ను జ‌రుపుకోగా, బ‌న్నీ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి కూడా ఈ పండ‌గును భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకుంది. ఇందులో భాగంగా బ‌న్నీ, స్నేహ‌లు క‌లిసి ఫోటో దిగారు. ఈ ఫోటో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

ఇదిలా ఉంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు క‌రోనా వ‌ల‌న తాత్కాలిక బ్రేక్ ప‌డింది. న‌వంబ‌ర్ 6 నుండి చిత్రాన్ని తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచ‌న చేస్తున్నారు. వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో ఈ చిత్ర షూటింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్టు స‌మాచారం. శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొంద‌నున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపిస్తారు. ర‌ష్మిక మంథాన క‌థానాయిక‌గా న‌టిస్తుంది.