Allu Arjun : పుష్ప 2 కోసం బన్నీ అంత డిమాండ్ చేస్తున్నాడా..?

Allu Arjun : పుష్ప పార్ట్ 1 సినిమాతో బన్నీ రేంజ్ ఇండియా మొత్తం పెరిగింది. ఈ సినిమాతో అధికారికంగా పాన్ ఇండియా స్టార్ గా అయ్యాడు అల్లు అర్జున్. ఈ సినిమా లోని బన్నీ డైలాగులు, మ్యానరిజమ్స్ ను సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా అనుకరించారు.

ఇక పుష్ప 2 కోసం బన్నీ వేరే మంచి ప్రాజెక్ట్‌లను కూడా వదిలేసుకున్నారు. ఇక పుష్ప 2 పుష్ప 1 కన్నా మరింత బాగుండేలా సుకుమార్, బన్నీ జాగ్రత్త తీసుకుంటున్నారు. పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిన సినిమా కావడంతో హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీస్తున్నారు.దక్షిణాది నీ మించి ఉత్తరాదిన ఈ సినిమా భారీ వసూళ్లు వర్షం కురిపించడంతో బాలీవుడ్ దిగ్గజాలలో కొత్త చర్చకు పునాది వేసింది ఈ చిత్రం. ఓ దక్షిణాది మూవీ ఉత్తరాదిన 100 కోట్లకు మించి వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికీ ఈ సినిమా యొక్క ఫలితాన్ని ఉత్తరాది మేకర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ స్థాయి ఫలితాన్ని హీరో అల్లు అర్జున్ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారట. మొదటి భాగానికి ఊహించని స్థాయిలో వసూలు రావడం తో రెండో భాగం రెమ్యునరేషన్ విషయంలో ఆయన గట్టిగా డిమాండ్ చేస్తున్నాడట.

పారితోషికానికి బదులుగా సినిమా హిందీ హక్కులను అడిగారట బన్నీ ఇందుకోసం అల్లు అరవింద్ ను రంగం లోకి దించారట. పుష్ప 1 మాములు హిట్ కాదు కదా అందుకే రెండో పార్ట్ మీద అంచనాలు భారీగా ఉండటం తో ఆ డిమాండ్ ను కాష్ చేసుకుంటున్నాడు అల్లు అర్జున్.పుష్ప మొదటి భాగం కోసం 45 కోట్లు తీసుకున్న బన్నీ ఇపుడు ఏకంగా హిందీ రైట్స్ అడగడం తో మైత్రి మూవీ మేకర్స్ వారు ఆలోచనలో పడ్డారు.ప్రస్తుతం రెండవ భాగం యొక్క స్క్రిప్ట్ పనులను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్న సుకుమార్ లొకేషన్స్ ను కూడా అదే సమయంలో ఫైనల్ చేస్తున్నారట. కేరళ అడవులలో పుష్ప రెండవభాగము సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఏప్రిల్ లో లేదా మేలో ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారట.