ఇండస్ట్రీ టాక్ : “బేబీ” బ్యూటీకి బంపరాఫర్…

టాలీవుడ్ సినిమా దగ్గర ఓ తెలుగు హీరోయిన్ నెట్టుకురావడం అనేది చాలా చాలా చాలా అరుదైన విషయం. పేరుకే తెలుగు సినిమా తప్ప తెలుగు సినిమాలో తెలుగు హీరోయిన్స్ కి బాగా కొరత ఉంది. అయితే చాలా మంది ట్రై చేస్తున్నప్పటికీ అరకొరగానే హీరోయిన్స్ కనిపిస్తూ ఉంటారు.

అయితే ఒక్క శ్రీలీల మినహా ఇక చాలా మంది సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారే అని చెప్పక తప్పదు. అయితే రీసెంట్ గా మాత్రం ఒక్క తెలుగు హీరోయిన్ పేరు మారు మోగింది. ఆమెనే యూట్యూబ్ అండ్ లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “బేబీ” బ్యూటీ వైష్ణవి చైతన్య.

అయితే ఈమెకి హీరోయిన్ గా ఈ సినిమా భారీ బ్రేక్ ని ఇవ్వగా దాని తర్వాత ఆమెకి ఆఫర్స్ రాలేదా అని చాలా మంది అనుకున్నారు. కాగా ఇప్పుడు అయితే ఈ యంగ్ హీరోయిన్ కి సూపర్ ఆఫర్ వచ్చినట్టుగా సినీ వర్గాలు తెలుపుతున్నాయి. టాలీవుడ్ లో ఎన్నో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ లు అందించిన దర్శకుడు “బొమ్మరిల్లు” భాస్కర్ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్ధూ జొన్నల గడ్డ కాంబినేషన్ కి హీరోయిన్ గా అయితే ఈమె ఫిక్స్ అయ్యినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి “ఆరెంజ్”, “నువ్వు నాకు నచ్చావ్”, మల్లీశ్వరి ఇంకా ఎన్నో ఎంటర్టైనర్ లను అందించి రీసెంట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో మంచి కం బ్యాక్ ని అందించిన తన దర్శకత్వంలో ఛాన్స్ అంటే బంపర్ ఆఫర్ అనే చెప్పాలి మరి.