రామ్ చరణ్ కోసం కొత్త భామని తెస్తున్న బుచ్చిబాబు.!

‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సన, ప్రస్తుతం రామ్ చరణ్‌తో ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండో సినిమాకే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ని డైరెక్ట్ చేసే గొప్ప ఛాన్స్ కొట్టేశాడు బుచ్చిబాబు సన. ఇది మామూలు విషయం కాదు.

కాగా, తన తొలి సినిమాతో ముద్దుగుమ్మ కృతి శెట్టిని హీరోయిన్‌గా పరిచయం చేశాడు. అలాగే మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ని పరిచయం చేసిన ఘనత కూడా బుచ్చిబాబుదే.

తాను డైరెక్టర్‌గా పరిచయమవుతూనే ఓ హీరోనీ, ఓ హీరోయిన్‌నీ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇద్దరికీ సక్సెస్ కెరీర్‌నే అందించాడు బుచ్చిబాబు సన. ఇక, ఇప్పుడు ఆయన రెండో సినిమాగా రూపొందనున్న ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్ మీదికెళ్లనుంది.

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి హీరోయిన్ ఎవరు.? అన్న ప్రశ్న తాజాగా తలెత్తుతోంది. ఈ ప్రశ్నకి సమాధానం త్వరలోనే రాబోతోంది. రష్మిక మండన్నా, శ్రీలీల, పూజా హెగ్ధే తదితర పేర్లు వినిపిస్తున్నప్పటికీ బుచ్చిబాబు మనసులో ఓ కొత్త భామ పేరు తడుతోందట.

ఎవరా భామ.? ఏంటా కథ.? తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ కొందరు అందాల భామలను స్ర్కూటినీ చేశాడట బుచ్చిబాబు సన. త్వరలోనే ప్రకటన రానుందనీ తెలుస్తోంది.

అయితే, అంతకన్నా ముందే రామ్ చరణ్ – శంకర్ సినిమా పూర్తవ్వాలి.. శంకర్ సినిమా పూర్తయితే తప్ప ఈ సినిమా పట్టాలెక్కించే ప్రశక్తే లేదు. ఆ సినిమా ఎప్పుడవుతుందో తెలియక, ఆ సినిమా ఆలస్యంపై రామ్ చరణ్ అభమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.