బాక్సాఫీస్ : “బ్రో” వరల్డ్ వైడ్ 2 రోజుల అదిరే వసూళ్లు.!

టాలీవుడ్ సినిమా దగ్గర చాలా రోజులు తర్వాత వచ్చిన బిగ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “బ్రో” చిత్రమే అని చెప్పాలి. మరి గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే యంగ్ హీరో శైవ ధరమ్ తేజ్ లు నటించగా దర్శకుడు అయితే సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజే కాస్త యావరేజ్ టాక్ తో మొదలైంది.

అయితే ఈ చిత్రం డే 1 కి ఆల్ మోస్ట్ 50 కోట్ల మేర వసూళ్లు రాబట్టగా మరీ భారీ ఓపెనింగ్స్ కాదు కానీ ఓ రేంజ్ ఓపెనింగ్స్ అయితే నమోదు అయ్యాయి. యక ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ వైడ్ రెండో రోజు కూడా మంచి వసూళ్లే నమోదు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

కాగా ఈ చిత్రం డే 2 కి అయితే 26 కోట్లకి పైగా గ్రాస్ ని వరల్డ్ వైడ్ అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం మొత్తం ఈ చిత్రం రెండు రోజుల్లో 75 కోట్ల మేర వసూళ్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక మూడో రోజు కూడా ఏమన్నా వర్కౌట్ అయితే డెఫినెట్ గా 100 కోట్ల క్లబ్ లో ఈ చిత్రం నిలుస్తుంది అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

మరి బ్రో అయితే ఎంత రాబడుతుందో చూడాలి. ఇంకా ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు.