పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మొట్టమొదటి సినిమా బ్రో బాక్సాఫీస్ వద్ద మొదటి వీకెండ్ లో భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ అందుకుంది. మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 23 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ తర్వాత ఆదివారం వరకు 10 కోట్లకు తక్కువ కాలేదు. అయితే సోమవారం రోజు మాత్రం ఈ సినిమాకు ఊహించిన విధంగా షాక్ అయితే తగిలింది.
మొదటి వీకెండ్ లో ఆదివారం వరకు బాగానే ఉన్నప్పటికీ నాలుగవ రోజు సోమవారం నెంబర్స్ ఐతే దారుణంగా డౌన్ అయ్యాయి. ఏపీ తెలంగాణలో 2వ రోజు 3 కోట్ల షేర్ దాటలేదు. ఇక మొత్తంగా నాలుగు రోజుల్లో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 46 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకుంది.
ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే అటువైపు నుంచి 5 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో దాదాపు 6 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా బ్రో సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 58 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ 97 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 97.50 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 98.50 కోట్లు షేర్ కలెక్షన్స్ రావాలి. కానీ ఇప్పటివరకు వచ్చిన లెక్కలు బట్టి చూస్తే ఇంకా సినిమా 40 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది. కానీ సోమవారం రోజు నెంబర్స్ ఒక్కసారిగా డౌన్ కావడంతో టార్గెట్ ను ఫినిష్ చేసే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. మరి బ్రో ఎలాంటి ఫలితాలు అందుకుంటాడో చూడాలి.