బాక్సాఫీస్ : డే1 “బ్రో” వరల్డ్ వైడ్ వసూళ్ల లెక్కలు.!

చాలా రోజులు తర్వాత టాలీవుడ్ దగ్గర కాస్త చెప్పుకోదగ్గ రేంజ్ లో వచ్చిన మరో అవైటెడ్ చిత్రం “బ్రో” కాగా ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ ముఖ్య పాత్రలో అయితే నటించారు. మరి దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్ అయితే మొదటి రోజు కాస్త మిక్స్డ్ టాక్ ని తీసుకున్నా సరే..

నిన్న సాయంత్ర నుంచి అయితే షోస్ మళ్ళీ పుంజుకున్నాయి. దీనితో బ్రో చిత్రం సాలిడ్ అక్యుపెన్సీ నమోదు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. మరి అన్ అఫీషియల్ గా అయితే ఈ చిత్రం వరల్డ్ వైడ్ డే 1 లెక్కలు ఇప్పుడు తెలుస్తున్నాయి. కాగా వీటిని చూసినట్టు అయితే..

మొదటగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 35 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా మిగతా ఇండియా అంతా 7 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో 9 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టగా మొదటి రోజుకి అయితే సుమారుగా 48 కోట్లకి పైగా వసూళ్ళని ఈ చిత్రం రాబట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఇంత మిక్స్డ్ టాక్ లో కూడా సుమారు 50 కోట్ల మేర గ్రాస్ ని అందుకోవడం అది కూడా నార్మల్ రేట్స్ తో అంటే ప్యూర్ పవన్ క్రేజ్ అని చెప్పాలి.

మరి షేర్ అయితే వరల్డ్ వైడ్ సుమారు 30 కోట్లు ఉండవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తానికి అయితే మొదటి రోజు బాగానే వసూళ్లు వచ్చాయని చెప్పొచ్చు. అలాగే ఈ డే 1 తోనే సినిమాకి జరిగిన బిజినెస్ లో 30 శాతం రికవర్ అయ్యింది అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మాటలు స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు.