టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన చిత్రమే “బ్రో ది అవతార్”. అయితే ఈ చిత్రంలో హీరో సాయి ధరమ్ తేజ్ అయినప్పటికీ ఈ సినిమాకి ఇప్పుడు తెలుగుస్టేట్స్ సహా యూఎస్ లో కూడా వస్తున్నా వసూళ్లు 90 శాతం పవన్ పేరు మీదనే అని చెప్పాలి.
అయితే ఈ చిత్రం మెయిన్ గా ఓవర్సీస్ మార్కెట్ లో అదిరే రన్ ని కొనసాగిస్తుంది. మరి ఈ చిత్రం లేటెస్ట్ గా ఐతే యూఎస్ మార్కెట్ లో సెన్సేషన్ ని సెట్ చేసింది. కాగా ఈ చిత్రం యూఎస్ మార్కెట్ లో ప్రీమియర్స్ తో 6 లక్షల డాలర్స్ కి పైగా వసూళ్లు అందుకోగా ఈ రెండు రోజుల్లో అయితే 4 లక్షల డాలర్స్ ని రాబట్టినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.
దీనితో యూఎస్ మార్కెట్ లో ఇప్పుడు బ్రో చిత్రం 1 మిలియన్ డాలర్స్ గ్రాస్ క్లబ్ లో చేరిపోయింది. దీనితో ఈ చిత్రం ఇప్పుడు ఒక్క యూఎస్ నుంచే 8 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టేసింది. ఇక మిగతా ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరింత స్థాయిలో ఉంటదని చెప్పాలి.
ఇక ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అయితే అందించారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా ప్రియా వారియర్, కేతిక శర్మలు హీరోయిన్స్ గా నటించారు. అలాగే థమన్ ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.