బ్రాహ్మి ఈజ్ బ్యాక్… 8 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ తో

టాలీవుడ్ లో నెంబర్ వన్ కమెడియన్ అంటే ఇప్పటికి టక్కున బ్రహ్మానందం పేరు ఎవరైనా చెబుతారు. చాలా కాలంగా బ్రహ్మానందం సినిమాలు తగ్గించేశారు. ఏవో కొన్ని సెలక్టివ్ గా చేస్తున్నారు. అది కూడా పూర్తి స్థాయి పాత్రలు లాకుండా గెస్ట్ అపీరియన్స్ లా కనిపిస్తున్నారు. జాతిరత్నాలు సినిమాలో జడ్జ్ గా బ్రహ్మానందం చివరిగా అదిరిపోయే రేంజ్ లో ఫన్ జెనరేట్ చేశారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన మేగ్జిమమ్ సినిమాలలో బ్రహ్మానందం గ్యారెంటీ గా ఉంటారు. అత్తారింటికి దారేది సినిమా వరకు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా కామెడీ పరంగా వర్క్ అవుట్ అయ్యింది. అతడు సినిమాలో అయితే బ్రహ్మానందంతో త్రివిక్రమ్ సృటించిన కామెడీ ట్రాక్ ఇప్పటికి ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. అలాగే జులాయి మూవీలో కూడా అంతే హిట్ అయ్యింది.

ఆ తర్వాత బ్రహ్మానందం మూవీస్ తగ్గించడం, త్రివిక్రమ్ చేసిన సినిమాలలో కూడా అతనికి తగ్గ క్యారెక్టర్స్ సృస్టించలేదు. మరల ఎనిమిదేళ్ళ తర్వాత త్రివిక్రమ్ చేస్తోన్న గుంటూరు కారం సినిమాలో బ్రహ్మానందం నటించబోతున్నారంట. అతడు తరహాలోనే ఓ ఇంటరెస్టింగ్ క్యారెక్టరైజేషన్ ని క్రియేట్ చేసి బ్రహ్మానందం ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

రంగ మార్తాండ సినిమాలో బ్రహ్మానందం కామెడీ పక్కన పెట్టి సీరియల్ రోల్ చేసి మెప్పించారు. అతని క్యారెక్టర్ కి మంచి ప్రశంసలు లభించాయి. తరుణ్ భాస్కర్ కీడాకోలాలో మరల ఒకప్పటి బ్రహ్మానందం కామెడీ చూస్తారని టీజర్ బట్టి స్పష్టం అవుతుంది. డార్క్ కామెడీ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీతో మళ్ళీ బ్రాహ్మీ బ్యాక్ టూ ఫామ్ గ్యారెంటీ అనే టాక్ నడుస్తోంది.

బ్రహ్మానందాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే ఇప్పటికి అతని నుంచి అద్భుతమైన కామెడీని జెనరేట్ చేసి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా చేయొచ్చని చాలా మంది చెప్పే మాట. ఇప్పుడు త్రివిక్రమ్ తన గుంటూరు కారం సినిమా కోసం అందుకే బ్రహ్మానందాన్ని తిరిగి బలమైన పాత్రతో ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.