సమంత నాగచైతన్య విడాకులపై స్పందించిన బ్రహ్మాజీ.. 250 కోట్ల భరణం గురించి కామెంట్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించిన మంచి గుర్తింపు పొందారు బ్రహ్మాజీ.ఈయన ఇప్పటికీ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నవ్విస్తూ తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన వ్యక్తిగత విషయాల గురించి స్పందించారు. తన పెళ్లి పిల్లల గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎప్పుడు నవ్వుతూ సందడి చేసే బ్రహ్మాజీకి అప్పుడప్పుడు కోపం కూడా వస్తుందని తెలుస్తోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ సెలబ్రిటీ స్టేటస్ ఉన్నవాళ్లు ఏదో ఒక విషయంలో తప్పనిసరిగా మాట్లాడాల్సి ఉంటుందని, సెలబ్రిటీలు ఒక విషయాన్ని చెబితే అది పెద్ద ఎత్తున ప్రజలలోకి వెళ్తుందని ఈయన తెలిపారు. అందుకు ఉదాహరణ సమంత నాగచైతన్య విడాకుల విషయమేనని ఈయన పేర్కొన్నారు.వారిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అయితే దురదృష్టవశాత్తు వారు విడిపోయారు అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని ఈయన తెలిపారు.

ఇక సమంత నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోతే ఒక నెటిజన్ మాత్రం సమంతది తప్పు అన్నట్టు కామెంట్ చేయడమే కాకుండా నాగచైతన్య నుంచి 250 కోట్ల భరణం కూడా తీసుకుంది అంటూ కామెంట్ చేశారు.ఇలా ఆ నెటిజన్ చేసిన కామెంట్ కు సమంత మాత్రమే కాకుండా నేను కూడా రియాక్ట్ అయ్యానని ఈయన తెలిపారు.ఒక సెలబ్రిటీతో చాట్ చేసే అవకాశం ఉన్నప్పుడు తన గురించి తన సినిమాల గురించి మాట్లాడాలి తన నటన బాగా లేకపోతే బాగా లేదని చెప్పాలి కానీ ఎవరికి సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే హక్కు లేదని ఈ సందర్భంగా బ్రహ్మజీ సమంతా విషయంలో స్పందించారు.ఇలా సమంత గురించి నేటిజన్స్ కామెంట్ చేయడంతో ఆమె స్నేహితుడు కూడా స్పందించలేదు కానీ నాకు చాలా బాధ కలిగిందని అందుకే తాను రియాక్ట్ అయ్యానని ఈయన తెలిపారు.