బోయపాటి.. మళ్ళీ బడ్జెట్ తిప్పలు?

దర్శకుడు బోయపాటి శ్రీను ఊర మాస్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు అని అందరికి తెలిసిందే. అయితే అతను ఒక సినిమాతో సక్సెస్ అందుకుంటే మళ్ళీ వెంటనే మరో సినిమాతో ఫ్లాప్ చూస్తున్నాడు. ఇక ఇప్పుడు అఖండ అనంతరం అతను చేస్తున్న BoyapatiRapo సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

ఇక ఈ సినిమాకు కూడా దర్శకుడు ఎప్పటిలానే బడ్జెట్ విషయంలో కాస్త తిప్పలు పడుతున్నట్లు తెలుస్తోంది. బోయపాటి అఖండ విషయంలో కూడా బడ్జెట్ లిమిట్స్ దాటాడు. కానీ ఆ సినిమా బాలయ్య కాంబినేషన్ వలన బాక్సాఫీస్ వద్ద క్లిక్ అయ్యింది. కానీ ఇప్పుడు రామ్ తో పాన్ ఇండియా అంటున్న బోయపాటి కాస్త రిస్క్ చేస్తున్నాడు అని అనిపిస్తోంది.

మొదట రూ.30 కోట్లతో తీయాలని అనుకున్న దర్శకుడు ఇప్పుడు లెక్కను రూ.50 కోట్లు దాటించేలా ఉన్నట్లు తెలుస్తోంది. అంతకంటే ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. సినిమాలో యాక్షన్ స్టఫ్ గట్టిగానే ఉందట. ఇక వాటి కోసం బోయపాటి ఎంతవరకైనా వెళతాడు. అయితే నిర్మాత శ్రీనివాస మాత్రం ఇప్పటికే ‘ది వారియర్’, ‘కస్టడీ’ సినిమాలతో దారుణమైన డిజాస్టర్స్ ఎదుర్కొన్నాడు. మరి ఈసారి రామ్ తో చేయబోయే సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.