టాలీవుడ్ మాస్ దర్శకుల్లో ఒకరైన దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఒకరు. మరి తన సినిమాల్లో ఇప్పటివరకు అన్నీ కూడా మాస్ హిట్స్ అయ్యాయి. రీసెంట్ గా ఒక్క వినయ విధేయ రామ తో భారీ డిజాస్టర్ ఇచ్చారు కానీ ఈ సినిమా తర్వాత చేసిన “అఖండ” తో సెన్సేషన్ కం బ్యాక్ ని బోయపాటి అందించారు.
మరి ఈ చిత్రం తర్వాత యంగ్ హీరో రామ్ పోతినేని తో చేసిన సినిమానే “స్కంద” ఇప్పుడు రిలీజ్ అయ్యింది. అయితే పెద్దగా మరీ అంత హై రేంజ్ అంచనాలు ఈ సినిమా తెచ్చుకోలేదు కానీ ఫైనల్ గా రిలీజ్ చేశారు. అయితే టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన సీక్వెల్స్ లో భాగంగా బోయపాటి కూడా తన గత చిత్రం “అఖండ” కి లాస్ట్ లో పార్ట్ 2 కూడా ఉందని హింట్ ఇచ్చాడు.
కానీ అది అధికారికంగా ఎక్కడా విజువల్ చూపించలేదు. కానీ తర్వాత మాత్రం బోయపాటి బయట సభాముఖంగానే అఖండ కి పార్ట్ 2 ఉందని కన్ఫర్మ్ చేసాడు. అయితే ఇప్పుడు స్కంద విషయంలో అయితే డైరెక్ట్ గా థియేటర్స్ లోనే క్లారిటీ ఇచ్చేసాడు బోయపాటి.
సినిమా క్లైమాక్స్ అనంతరం స్కంద పార్ట్ 2 అంటూ క్రేజీ హై ని అందించాడు. దీనితో బోయపాటి నుంచి మరో సీక్వెల్ సినిమా వస్తుంది అని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందించాడు అలాగే శ్రీనివాస చిట్టూరి నిర్మాణం వహించారు.