నందమూరి బాలకృష్ణకీ, బోయపాటి శ్రీనుకీ.. ఎక్కడో లింక్ సరిగ్గా సెట్ అయ్యింది. బోయపాటి హీరో అంటే బాలయ్య మాత్రమేనేమో.. అని ఓ వర్గం ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు మరి.!
ఆ ‘అతి’ బాలయ్యకే సూటవుతుంది. బాలయ్యనే మైండ్‌లో పెట్టుకుని వేరే హీరోలతో సినిమాలు చేస్తున్నప్పుడూ దర్శకుడు బోయపాటి శ్రీను ఆ అతి ప్రదర్శిస్తుంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
‘స్కంద’ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటంతో, బోయపాటి రేంజ్ ఒక్కసారిగా కిందకి పడిపోయింది. నిజంగానే పడిపోయిందా.? ఏమో అంతేనేమో.. అలాగే అనుకోవాలేమో.!
‘స్కంద’ హిట్టయితే, నందమూరి బాలకృష్ణ తనయుడు హీరోగా ఓ సినిమా ప్రకటన జరిగి వుండేదట.. అదీ బోయపాటి దర్శకత్వంలో. కానీ, ఇప్పుడా అవకాశమే లేకుండా పోయిందట.
‘తర్వాత చూద్దాం’ అని బాలయ్య, బోయపాటితో చెప్పేశాడట. బోయపాటి లేదా అనిల్.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి తన కొడుకుని అప్పజెప్పాలన్నది బాలయ్య ఆలోచన. ఇప్పుడైతే ఒకే ఆప్షన్.. అదీ అనిల్ రావిపూడి మాత్రమే. ‘భగవంత్ కేసరి’తో ఆ ఆప్షన్ కూడా ఔట్ అయిపోతే.?