బాక్సాఫీస్ : వరల్డ్ వైడ్ “ఆనిమల్” డే 1 రికార్డు గ్రాస్..!

లేటెస్ట్ గా బాలీవుడ్ మార్కెట్ సహా తెలుగులో కూడా భారీ అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఏక్షన్ డ్రామా చిత్రమే “ఆనిమల్”. బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ తో టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు క్రేజీ రెస్పాన్స్ తో ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది.

కాగా ఒక్క ఇండియా లోనే కాకుండా ఈ చిత్రం యూఎస్ మార్కెట్ లో కూడా బాలీవుడ్ హిస్టీరి లోనే ఒక రికార్డు ఓపెనర్ గా నిలవడం విశేషం. మరి ఇలా ఈ చిత్రం మొదటి రోజే రికార్డు వసూళ్లు కొల్లగొట్టినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేస్తున్నారు. మరి ఈ చిత్రానికి అయితే వరల్డ్ వైడ్ గా 116 కోట్ల గ్రాస్ నమోదు అయ్యింది.

దీనితో ఒక నాన్ హాలిడే రిలీజ్ గా వచ్చి హైయెస్ట్ ఓపెనింగ్ అందుకున్న బాలీవుడ్ చిత్రంగా ఇప్పుడు ఆనిమల్ రికార్డు సెట్ చేసి నిలిచింది. అంతే కాకుండా బాలీవుడ్ లో రెండో అతి పెద్ద ఓపెనింగ్ సినిమాగా కూడా ఇది నిలిచింది. వీటితో ఈ సినిమా రణబీర్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్ సహా ఇండియా నుంచి అయితే మూడో అతి పెద్ద ఓపెనింగ్ సినిమాగా నిలిచినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఇక ఇదే ఫ్లో కానీ కొనసాగితే మాత్రం ఈ సినిమా లాంగ్ రన్ లో వండర్ రన్ ని సెట్ చేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. కాగా ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా బాబీ డియోల్ సహా పృథ్వీ లు విలన్స్ గా నటించారు.