బాక్సాఫీస్ : ఇప్పటికీ కుమ్ముతున్న “RRR”..యూఎస్ లో తాజా వసూళ్లు.!

RRR

ఈ ఏడాది స్టిల్ పాన్ ఇండియా అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం డెఫినెట్ గా మన టాలీవుడ్ భారీ హిట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) అనే చెప్పి తీరాలి. ఇప్పటికీ కూడా ఈ సినిమా భారీ రెస్పాన్స్ ని ఇతర దేశాల ఆడియెన్స్ లో అందుకుంటూ వస్తుంది.

దర్శకుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ల కలయికలో వచ్చిన ఈ చిత్రం లేటెస్ట్ వసూళ్లు అయితే ఇంకా నమోదు అవుతున్నాయి. యూఎస్ రిలేటెడ్ పలు దేశాల్లో ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్ ఇంకా ప్రదర్శితం అవుతూ ఉండగా ఈ వసూళ్లు కూడా బాక్సాఫీస్ దగ్గర యాడ్ అవుతున్నాయి.

మరి రీసెంట్ గా యూఎస్ లో రీ రిలీజ్ చేసిన ఈ చిత్రానికి ఇప్పటివరకు 2 లక్షల 60 వేలకి పైగా డాలర్స్ వసూలు అయ్యినట్టుగా తెలుస్తుంది. ఇక దీనితో ఒక్క యూఎస్ వసూళ్లే ఈ చిత్రానికి 14.43 మిలియన్ డాలర్స్ కి చేరాయి.

అంటే మన దేశపు కరెన్సీ లో 117 కోట్ల 29 లక్షలకి పైగా RRR ఇప్పటికీ ఇంకా వసూలు చేస్తూ కొనసాగుతూ సత్తా చాటుతుంది. అలాగే రానున్న రోజుల్లో ఈ చిత్రం మరిన్ని మంచి వసూళ్లు నమోదు చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.