బాక్సాఫీస్ : ఫైనల్ గా లేటెస్ట్ వసూళ్లతో జపాన్ లో నెం1 గ్రాసర్ గా “RRR”.!

RRR

దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి సృష్టించిన అద్భుత ఆక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కోసం ఇంకా ప్రపంచ వ్యాప్తంగా అయితే చర్చ నడుస్తుంది. దీనితో హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ ల పేర్లు కూడా అలా మారుమోగుతున్నాయి. ఇక మన దేశంలో అనుకుంటే ఇతర దేశాల్లో ఈ సినిమాకి ఆదరణ చూస్తే ప్రతి భారతీయుడికి కూడా గర్వంగా అనిపిస్తుంది.

ఇక రీసెంట్ గా అయితే ఈ చిత్రం జపాన్ లో రిలీజ్ కి రాగ ఇప్పుడు అక్కడ ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోడానికి వచ్చింది. అయితే ఈ సినిమా కన్నా ముందు జపాన్ లో అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ ముత్తు సినిమా 23.5 కోట్లు గ్రాస్ ని వసూలు చేయగా దానిని అయితే ఇప్పుడు కేవలం 49 రోజుల్లో RRR చిత్రం 24 కోట్లు గ్రాస్ వసూలు చేసి ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డు ఇండియన్ గ్రాసర్ గా నిలిచి చరిత్ర సృష్టించింది.

అయితే ఆర్ ఆర్ ఆర్ అయితే ఇప్పటికీ కూడా జపాన్ లో చాలా నిలకడ వసూళ్లు కనబరుస్తూ దూసుకెళ్తూ ఉండడం విశేషం.. కాగా ఈ సినిమా మొదటి రోజు కన్నా మధ్యలో 21వ రోజు అలాగే 40 రోజులలో మరింత స్థాయిలో వసూళ్లు నమోదు కావడం విశేషం. దీనితో అయితే ఈ చిత్రం జపాన్ లో ఇప్పుడు నెంబర్ 1 గ్రాసర్ గా నిలిచి అదరగొట్టింది.