బాక్సాఫీస్ రిపోర్ట్ : “యశోద” 5 రోజుల టోటల్ వసూళ్లుతో టార్గెట్ కి దగ్గరగా.!

సౌత్ ఇండియన్ సినిమా స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత నటించిన లేటెస్ట్ సినిమా “యశోద” మంచి అంచనాలు నడుమ గత వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడుకి బాక్సాఫీస్ దగ్గర 5 రోజుల సక్సెస్ ఫుల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.

అయితే ఈ చిత్రం వసూళ్లు విషయానికి వస్తే 5 రోజుల్లో ఈ చిత్రం మంచు వసూళ్లే నమోదు చేసినట్టుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే దాదాపు సినిమాకి జరిగిన బిజినెస్ లో 85 శాతానికి పైగా వసూళ్లు రాబట్టేయగా ఐదు రోజుల్లో అయితే ఈ చిత్రం వరల్డ్ వైడ్ 22 కోట్ల గ్రాస్ ని అలాగే 10.8 కోట్ల షేర్ ని అందుకుంది.

అలాగే నిన్నటి వసూళ్లతోనే యూఎస్ లో ఈ సినిమా 5 లక్షల డాలర్స్ మార్క్ ని కూడా దాటి మంచి వసూళ్లు రాబడుతూ కొనసాగుతుంది. అయితే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 12 కోట్లు మేర జరగగా ఇప్పటికే 99 పర్సెంట్ వసూళ్లుతో టార్గెట్ ని ఈ చిత్రం రీచ్ అయ్యిపోయింది.

ఇక ఈ రోజు నుంచి ఈ సినిమాకి ఆల్ మోస్ట్ లాభాలే వస్తాయని చెప్పొచ్చు. ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు హరి – హరీష్ లు తెరకెక్కించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక రోల్ చేసింది. ఫైనల్ గా మాత్రం సమంత కం బ్యాక్ మాములుగా పడలేదు..