బాక్సాఫీస్ : వరల్డ్ వైడ్ “నా సామిరంగ” 3 డేస్ వసూళ్లు.!

తెలుగు సినిమా నుంచి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన పలు చిత్రాల్లో మన సీనియర్ హీరోస్ వెంకటేష్, నాగార్జునల నుంచి కూడా వచ్చాయి. కాగా ఈ చిత్రాల్లో అక్కినేని నాగార్జున నటించిన ఏక్షన్ కం ఫ్యామిలీ డ్రామానే “నా సామిరంగ”. ఈ సినిమాని ఓ రేంజ్ స్పీడ్ లో కంప్లీట్ చేసి ఒక వండర్ గా రిలీజ్ చేసేసాడు దర్శకుడు విజయ్ బిన్నీ.

ముందు చాలానే ట్రోల్స్ వచ్చినప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం పండుగలో మరో మంచి హిట్ గా నిలిచి నాగార్జున కెరీర్ లో మరో క్రేజీ హట్ గా నిలిచి అదరగొట్టింది. దీనితో నాగ్ మంచి కం బ్యాక్ అందుకోగా ఈ సినిమా అనూహ్య రెస్పాన్స్ తో అయితే బాక్సాఫీస్ దగ్గర నిలబడింది.

కాగా మొత్తం మూడు రోజులు రన్ ని ఈ సినిమా కంప్లీట్ చేసుకోగా ఈ మూడు రోజుల్లో కూడా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం సుమారు 25 కోట్ల గ్రాస్ ని అందుకుంది. అంతే కాకుండా 12.5 కోట్ల షేర్ ని కూడా అందుకొని ఆల్ మోస్ట్ జరిగిన బిజినెస్ ని దాటేసేలా కనిపిస్తుంది.

దీనితో తెలుగు స్టేట్స్ సహా యూఎస్ లో కూడా బహుశా ఈ రెండు రోజుల్లో అయితే టార్గెట్ రీచ్ అయ్యిపోయి సినిమా లాభాల్లోకి వెళుతుంది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కాగా ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించగా అల్లరి నరేష్, మిర్నా, రాజ్ తరుణ్ మరియు రుక్షర్ దిలన్ లు కూడా నటించారు. అలాగే ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.